ప్రణయ్ హత్య కేసులో సంచలన తీర్పు


Send us your feedback to audioarticles@vaarta.com


తెలుగు రాష్ట్రాల్ని కుదిపేసిన ప్రణయ్ హత్య కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. నల్గొండ కోర్టు ఈ మేరకు తుది తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏ-1గా ఉన్న మారుతిరావు నాలుగేళ్ల కిందటే ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.
మిగతా వాళ్లకు తాజాగా కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది. ఇతడే పెద్ద కత్తితో ప్రణయ్ ను నడిరోడ్డుపై హత్య చేశాడు. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ కేసుకు సంబంధించి అందరికీ బెయిల్ దక్కినప్పటికీ, సుభాష్ కు మాత్రం బెయిల్ రాలేదు. ఇప్పుడు అతడు ఉరికంబం ఎక్కబోతున్నాడు. పైకోర్టుకు వెళ్లినా అతడికి ఊరట దక్కకపోవచ్చు.
ఇక మిగిలిన నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. వీళ్లలో మారుతీరావు తమ్ముడు కూడా ఉన్నారు. ఘటన జరిగిన ఐదున్నరేళ్ల తర్వాత వెలువడిన ఈ తీర్పుతో కేసు కొలిక్కి వచ్చినట్టయింది.
తన కుమార్తె అమృత, ప్రణయ్ ను ప్రేమ వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు మారుతీరావు. మరీ ముఖ్యంగా దళిత యువకుడ్ని పెళ్లాడ్డంతో పరువు పోయినట్టు భావించాడు. ఓ రౌడీ గ్యాంగ్ కు సుపారీ ఇచ్చి ప్రణయ్ ను హత్య చేయించాడు. ఇప్పుడు హైడ్రా కమిషనర్ గా ఉన్న రంగనాధే, అప్పుడీ కేసును ఎస్పీ స్థాయిలో డీల్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com