close
Choose your channels

చిత్రపురిలో హాస్పిటల్ కాదు.. ముందు ఫుడ్డు పెట్టించు : చిరంజీవిపై కోటా సంచలన వ్యాఖ్యలు

Saturday, May 7, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు కోట శ్రీనివాసరావు. తన అసాధారణ ప్రతిభతో ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందాడు. ఇటీవల వయసు మీద పడటంతో ఆయన సినిమాలకు దూరంగా వుంటున్నారు. ఈ నేపథ్యంలో కోటా శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇస్తూ.. ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఉంటారు. దీంతో అవికాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అప్పట్లో మా ఎన్నికల సమయంలోనూ కోట శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ తర్వాత యాంకర్ అనసూయపై చేసిన కామెంట్లు సైతం వివాదానికి దారితీశాయి. తాజాగా Indiaglitzతో మాట్లాడిన కోటా శ్రీనివాసరావు మెగాస్టార్ చిరంజీవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు

ఇటీవల మే డే సందర్భంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. సందర్భంగా తాను సినీ కళాకారుడిని కాదని.. సినీ కార్మికుడినని చిరు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా సినీ కార్మికుల కోసం చిత్రపురిలో ఆసుపత్రి కట్టిస్తానని వెల్లడించారు. దీనిపై కోటా తనదైనశైలిలో స్పందించారు. ముందు కార్మికులకు ఫుడ్డు పెట్టాలని.. ఆయన కట్టే ఆసుపత్రికి ఎవరొస్తారంటూ ప్రశ్నించారు. ప్రతిభ వుండి కూడా ఎంతోమంది పని లేక కృష్ణానగర్‌లో ఆకలితో అలమటించడమే కాకుండా వ్యసనాల బారినపడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని కోటా ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల దగ్గర డబ్బులుంటే అపోలో ఆసుపత్రికి వెళ్తారు కానీ.. చిరంజీవి కట్టే ఆసుపత్రికి ఎందుకు వెళ్తారని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

కోట్ల రూపాయల పారితోషికం తీసుకునే చిరంజీవి సినీ కార్మికుడు ఎలా అవుతారని కోటా ప్రశ్నించారు. తనకు అలాంటి మాటలు నచ్చవని కానీ చిరంజీవి అంటే ఎంతో గౌరవమని శ్రీనివాసరావు అన్నారు. తన ఇంటికి సాయం కోసం వచ్చే వారికి 500 , 1000 ఇచ్చి పంపుతానని ఆయన చెప్పారు. అంతేకానీ నేను ఇది చేస్తా, అది చేస్తానని చెప్పనని కోటా కుండబద్ధలు కొట్టారు. ఇబ్బందుల్లో వున్న కార్మికుల కోసం రూ.5 లక్షల వరకు సాయం చేశానని శ్రీనివాసరావు గుర్తుచేశారు. మా అసోసియేషన్ కోసం కూడా విరాళాలు ఇచ్చానని ఆయన తెలిపారు. కార్మికుడినని చెప్పుకుంటున్న చిరంజీవి ఎవరికైనా ఏనాడైనా రూపాయి సాయం చేశారా ... ఆయన సినిమాల్లో ఎవరికైనా వేషాలు ఇప్పించారా అని శ్రీనివాసరావు నిలదీశారు. షుగర్ పేషెంట్‌నైన తాను తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం వృద్ధాప్యంలోనూ నాలుగు రోజుల పాటు నిరాహార దీక్ష చేశానని కోటా గుర్తుచేశారు.

ఇక.. ఇన్నేళ్ల కెరీర్‌లో హీరోగా ఎందుకు చేయలేదని యాంకర్ అడిగిన ప్రశ్నకు కోటా శ్రీనివాసరావు స్పందించారు. ఎన్టీఆర్, రజనీకాంత్‌లకు అది దేవుడిచ్చిన వరమని.. అందుకే వారు 60, 70 ఏళ్ల వయసులో హీరోలుగా చేసినా జనం చూశారని ఆయన అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.