Kota Srinivasa Rao:చనిపోయానంటూ వార్తలు .. పోలీసులు మా ఇంటికి వచ్చారు , డబ్బు కోసం అలాంటి పోస్టులా : కోటా శ్రీనివాసరావు
Send us your feedback to audioarticles@vaarta.com
సోషల్ మీడియా రాకతో ప్రతి వార్తా క్షణాల్లో వైరల్ అయిపోతోంది. ఇదే సమయంలో ఏది నిజమో, ఏది అబద్ధమో చెప్పలేని పరిస్ధితి. ఎవరైనా సెలబ్రెటీ ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో జాయిన్ అయితే చాలు వారు చనిపోయారంటూ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో ఫలానా ప్రముఖులు తామే బతికే వున్నామని .. తప్పుడు వార్తలు నమ్మొద్దంటూ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లోకి సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు చేరారు. కోటా మరణించారంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వార్త క్షణాల్లో వైరల్ అయ్యింది. అసలే కే. విశ్వనాథ్, జమున, తారకరత్నల మరణాలతో తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయిన చిత్ర పరిశ్రమ ఈ వార్తతో ఉలిక్కిపడింది.
డబ్బు కోసం మనిషి ప్రాణాలతో ఆటలా :
అయితే కాసేపటికే ఇది తప్పుడు వార్తని తేలింది. కోటా శ్రీనివాసరావు పూర్తి ఆరోగ్యంతో వున్నారని ఆయన సన్నిహితులు తెలిపారు. ఆ కాసేపటికీ కోటా రంగంలోకి దిగారు. ఓ వీడియో విడుదల చేసిన ఆయన ఇలా అన్నారు. ‘‘ అందరికీ నా ఉగాది శుభాకాంక్షలు. ఏం లేదండి.. ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎవరో సోషల్ మీడియాలో వేశాడట నేను పోయానని. కోటా శ్రీనివాసరావు దుర్మరణమని.. అలాంటి వార్తలు నాకు తెలియదు. తెల్లారి పండగ, ఏం చేయాలి అని మాట్లాడుకుంటుండగా .. పొద్దున 7.30 నుంచి ఇప్పటి వరకు నేను 50 ఫోన్లు మాట్లాడా. మా కుర్రాడు మాట్లాడాడు. ఆశ్చర్యం ఏంటంటే పోలీసులు వచ్చేశారు. మీకు నివాళులర్పించడనాికి ప్రముఖులు వస్తారు కదా సెక్యూరిటీ ఇవ్వడానికి వచ్చాం అని పోలీసులు చెప్పారు. ఇలాంటి వార్తలు నమ్మొద్దని మనవి చేసుకుంటూ .. ప్రజలు కూడా గట్టిగా రియాక్ట్ అవ్వాలి. డబ్బు సంపాదించడానికి బోల్డన్నీ పనులు వున్నాయి. మనిషి ప్రాణాలతో ఆడుకోవద్దు.. నమస్కారం.’’ అంటూ కోటా ముగించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments