close
Choose your channels

పాప‌కు జ‌న్మ‌నిచ్చిన స‌మీరారెడ్డి

Saturday, July 13, 2019 • తెలుగు Comments

పాప‌కు జ‌న్మ‌నిచ్చిన స‌మీరారెడ్డి

మాజీ హీరోయిన్ స‌మీరారెడ్డి శుక్ర‌వారం ఉద‌యం పాప‌కు జ‌న్మ‌నిచ్చారు. తెలుగులో జైచిరంజీవ, అశోక్‌, న‌ర‌సింహుడు చిత్రాల్లో హీరోయిన్‌గా న‌టించిన స‌మీరారెడ్డి, ప‌లు బాలీవుడ్ సినిమా్ల్లోనూ న‌టించారు. 2014లో అక్ష‌య్ వ‌ర్దే అనే బిజినెస్‌మేన్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు 2015లో హ‌న్స్ వ‌ర్దే అనే బాబు పుట్టాడు. కాగా.. ఇప్పుడు ఓ పాప పుట్టింది. ఈ విష‌యాన్ని స‌మీరారెడ్డి త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియ‌జేసింది. `చిన్నారి దేవ‌త పాప రూపంలో మా ఇంట్లోకి అడుగుపెట్టింది. మీ అశీర్వాదాలు అందించినందుకు కృత‌జ్ఞ‌త‌లు` అన్నారు స‌మీరారెడ్డి. ఈ మెసేజ్‌తో పాటు చిన్నారి పాప త‌న చేయిని ప‌ట్టుకున్న ఫొటోను కూడా షేర్ చేశారు. నెటిజ‌న్స్ స‌మీరాకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz