close
Choose your channels

స‌మంత కొత్త వ్యాపారం

Wednesday, February 19, 2020 • తెలుగు Comments

స‌మంత కొత్త వ్యాపారం

హీరోయిన్ స‌మంత అక్కినేని సినిమాలతో బిజీగా ఉంటోంది. అయితే త్వ‌ర‌లోనే ఈమె కొత్త వ్యాపారంలోకి అడుగుపెడుతున్నారు. ఇంత‌కు స‌మంత ఎంట్రీ ఇస్తున్న రంగమేంటో తెలుసా...విద్యారంగం. ఫిబ్ర‌వ‌రి 22న స‌మంత ప్రీ స్కూల్‌ను స్టార్ట్ చేస్తుంద‌ట‌. విద్యావేత్త ముక్తా ఖురానాతో పాటు శిల్పా రెడ్డితో క‌లిసి స‌మంత ఈ స్కూల్‌ను స్టార్ట్ చేస్తున్నారు. 2019 ప్రారంభంలో వ‌చ్చిన ఈ ఆలోచ‌న ఇప్ప‌టికి నిజ‌మైంద‌ని అంటోన్న స‌మంత త‌న స్కూల్‌కి ఏకం అనే పేరు పెట్టుకుంది. ఈ స్కూల్ ద్వారా పిల్ల‌ల‌కు క్వాలిటీ ఎడ్యుకేష‌న్ ఇవ్వ‌డానికి వీల‌వుతుంద‌ని స‌మంత చెబుతూ ఆస‌లు స్కూల్ ఎలా నిర్మిస్తున్నార‌నే దాన్ని చిన్న వీడియోగా తీసి పోస్ట్ చేసింది.

నాగ‌చైత‌న్య‌తో పెళ్లి త‌ర్వాత పెర్ఫామెన్స్ పాత్ర‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తున్న స‌మంత అక్కినేని.. ఒక‌వైపు సినిమాలు చేస్తూనే వెబ్‌సిరీస్ `ది ఫ్యామిలీ మేన్` సీజ‌న్‌2లో నెగ‌టివ్ షేడ్స్‌లో న‌టించింది. ప్ర‌త్యూష అనే స్వ‌చ్ఛంద సంస్థ ద్వారా పేద పిల్ల‌ల‌కు సాయం చేస్తుంది. ఇవ‌న్నీ కాకుండా స‌మంత ఓ కొత్త రంగంలోకి అడుగుపెట్టింది. మ‌రి ఈ ర‌గంలో ఆమె ఎలా రాణిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz