close
Choose your channels

ట్రోలింగ్స్‌పై స‌మంత ఆన్స‌ర్ ఇదే...

Wednesday, January 27, 2021 • తెలుగు Comments

ట్రోలింగ్స్‌పై స‌మంత ఆన్స‌ర్ ఇదే...

సినిమాల సంగ‌తేమో కానీ.. స‌మంత అక్కినేని మాత్రం సోష‌ల్ మీడియాలో చాలా బిజీ బిజీగా ఉంది. ఓ బేబీ త‌ర్వాత మ‌రో సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు స‌మంత న‌టించ‌లేదు. ఆమె చేయాల్సిన శాకుంత‌లం కూడా రీసెంట్‌గా ఓకే చేసింది. ఇది స్టార్ట్ కావ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. అయితే ఈలోపు స‌మంత సోష‌ల్ మీడియాలో బిజీగా ఉంటూ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది. రీసెంట్‌గా అభిమానుల‌తో ప్ర‌త్యేకంగా ముచ్చ‌టించింది. అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌న్నెంటికో ఆమె ఓపిక‌గా స‌మాధానం చెప్పింది. 2020లో రానా మిహీకా బ‌జాజ్ పెళ్లి త‌న‌కు గుర్తుండి పోయే విష‌య‌మ‌ని స‌మంత ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఆన్స‌ర్ ఇచ్చింది. అలాగే ఇర‌వై ఏళ్లలో మీ గురించి చెప్పిండి? అని అడిగిన ప్ర‌శ్న‌కు `ఇంకా ఎద‌గాల‌ని తాప‌త్ర‌య‌ముండేది` అని సామ్ స‌మాధాన‌మిచ్చింది.

ఇక నెటిజ‌న్స్ చేసే ట్రోలింగ్‌ను ఎలా భావిస్తారు అని ప్ర‌శ్నిస్తే.. `కెరీర్ ప్రారంభంలో ఒక‌రు న‌న్ను విమ‌ర్శిస్తే చాలా బాధ‌ప‌డేదాన్ని. ట్రోలింగ్ వ‌ల్ల ఎన్నో నిద్ర‌లు లేని రాత్రులు గ‌డిపాను. అయితే ఇప్పుడు ట్రోలింగ్స్‌ను చూస్తే న‌వ్వొస్తుంది. ఒక‌రు ట్రోలింగ్ చేసే స్థాయికి ఎదిగామ‌ని భావిస్తుంటాను`` అని స‌మాధాన‌మిచ్చింది స‌మంత అక్కినేని.

Get Breaking News Alerts From IndiaGlitz