close
Choose your channels

లక్ష మొక్కలు నాటుదామంటున్న సమంత

Monday, August 26, 2019 • తెలుగు Comments

లక్ష మొక్కలు నాటుదామంటున్న సమంత

సమంత మొక్కలు నాటడానికి సిద్ధమైంది. అది కూడా ఒకట్రెండు కాదు.. ఏకంగా లక్ష మొక్కలు. మరి సమంత అన్ని మొక్కలు ఎందుకు నాటుతుంది. అంటే ఈమధ్య సోషల్ మీడియా ట్రెండింగ్‌లో ఛాలెంజెస్ విసురుతున్నారు. అలా ఎవరైనా ఛాలెంజ్ విసిరారా? అనుకుంటే అది కూడా కాదు.. మన భవిష్యత్ తరాల కోసం. రాబోయే తరాల కోసం సమంత ఇప్పుడు మొక్కలు నాటడమేంటనే సందేహం కూడా రాక మానదు. అసలు విషయమేమంటే.. ఆధ్యాత్మిక వేత్త జగ్గీ వాసుదేవ్ జల సంరక్షణ కోసం దేశమంతటా తిరుగుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో సమంత కూడా భాగమైంది. అందుకోసం లక్ష మొక్కలు నాటాలని నిర్ణయించుకుంది. అందుకోసం అభిమానులు కూడా మద్దతు ఇవ్వాలని కోరింది.

మొక్కలు నాటాలనుకునేవారు cauverycalling.org అనే వెబ్‌సైట్ ద్వారా విరాళాలను ఇవ్వాలని సమంత అక్కినేని కోరారు. అందుకోసం తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వీడియో విడుదల చేశారు. 42రూపాయలు ఇస్తే ఓ మొక్క నాటినట్లేనని ఆమె ప్లాకార్డ్ పట్టుకుని వీడియో సందేశం ఇచ్చారు. అందులో ‘‘మన జల వనరలు అడుగంటిపోతున్నాయి. దీనికి పరిష్కారమేంటి? అని ఆలోచించినప్పుడు నాకు కావేరి కాలింగ్ మాత్రమే పరిష్కారం అనిపించింది. అందుకోసమని నేను లక్షమొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నా. ఇందులో అభిమానులు కూడా భాగం కావాలి’’ అని ఆమె కోరారు. నీటి సంరక్షణ కోసం సమంత చేస్తున్న ఈ పనిని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.
ప్రత్యూష సపోర్ట్ అనే ట్రస్ట్ ద్వారా మహిళలు, పిల్లలకు మందులను ఇప్పిస్తూ సేవలో చేస్తున్న సమంత రెండు తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల కోసం బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా మారారు. ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్‌గా ‘ఓ బేబీ’తో సక్సెస్ అందుకున్నారు. త్వరలోనే తమిళ చిత్రం ‘96’ రీమేక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz