close
Choose your channels

కెరీర్‌లోనే బిగ్గెస్ట్ స్టెప్ .. హాలీవుడ్‌లోకి సమంత..!!

Friday, November 26, 2021 • తెలుగు Comments

జీవితంలో ఒడిదొడుకులు సహజమే. విజయానికి సంబరపడకుండా.. కష్టానికి కృంగిపోకుండా నిలబడేవాడే జీవితాన్ని గెలుస్తాడు. అలాంటి వారు మనచుట్టూ ఎందరో ఉన్నారు. ఈ కోవలోకే వస్తారు అగ్ర కథానాయక సమంత. ఇటీవలే భర్త నాగచైతన్యతో ఆమె విడాకులు తీసుకున్నారు. ఎవరి జీవితంలోనైనా వైవాహిక జీవితం అత్యంత కీలకమైనది. అత్యంత సున్నితమైన ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అది చావు దెబ్బ కొడుతుంది. పోనీ ఏదోలాగా బతికేద్దామని అనుకున్నా.. సమాజం నుంచి తప్పించుకోవడం అసాధ్యం. సమంత సైతం విడాకులు తీసుకున్న తొలినాళ్లలో ఇదే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోర్టుకెక్కితే గానీ లోకం నుంచి ఆమె బయటపడలేదు. అయినప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితంపై నిత్యం ట్రోలింగ్ జరుగుతూనే వుంటుంది.

అయితే ఇవేవి పట్టించుకోకుండా తన వృత్తే ప్రధానమని భావించి తిరిగి మామూలు మనిషిగా మారుతున్నారు సామ్. దీనిలో భాగంగా వరుస ప్రాజెక్ట్స్‌కు సంతకాలు చేస్తూ సరికొత్తగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. పెళ్లి తర్వాత డిసెంట్‌ రోల్స్‌ సెలక్ట్‌ చేసుకున్న సామ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ తర్వాత భిన్నమైన పాత్రలకు మోగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌లో బిగ్గెస్ట్‌ స్టెప్‌ తీసుకున్నారు. త్వరలో ఆమె ఒక ఇంటర్నేషనల్ మూవీలో నటించనున్నారు. శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు సమంత.

ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్‌ ఫిలిప్‌ జాన్‌ తెరకెక్కించనున్న ఇంగ్లిష్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ చిత్రంలో ఆమె కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ మేరకు ఫిలిప్‌ జాన్‌‌తో దిగిన ఫోటోలను సమంత షేర్ చేశారు. అంతేకాదు తాను ప్రపంచంలో ఏ మూలకి వెళ్లినా భారతదేశాన్ని గర్వపడేలా చేస్తానని అభిమాని ట్వీట్‌కు సమంత రిప్లయ్ ఇచ్చారు. భారతీయ రచయిత ఎన్‌ మురారి రాసిన ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ లవ్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇందులోనూ సమంత వివాదాస్పద పాత్రలోనే కనిపించనున్నట్లు సమాచారం. బై-సెక్సువల్‌ తమిళ అమ్మాయిగా ఆమె నటించనున్నారట. ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ను తమిళ, హిందీ భాషలతో పాటు ఇంగ్లిష్, ఫ్రెంచ్ లాంటి భాషల్లో కూడా విడుదల చేస్తారని ఫిలింనగర్ టాక్.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz