close
Choose your channels

షూటింగ్ పూర్తి చేసుకున్న సమంత

Monday, October 14, 2019 • తెలుగు Comments

షూటింగ్ పూర్తి చేసుకున్న సామ్‌

అక్కినేని స‌మంత ఈ ఏడాది `ఓ బేబీ`తో హిట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు స‌మంత కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచింది. త‌మిళ చిత్రం `96`.. తెలుగు రీమేక్‌`జాను` సినిమాకు సంబంధించిన స‌మంత షెడ్యూల్ పూర్త‌య్యింద‌ట‌. ఈ విషయాన్ని స‌మంత‌నే తెలియ‌జేసింది. ``జాను`కి సంబంధించి నా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశాను. డైరెక్ట‌ర్ ప్రేమ్‌, నా స‌హన‌టుడు శ‌ర్వానంద్‌కి థ్యాంక్స్‌` అన్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

విజ‌య్ సేతుప‌తి, త్రిష న‌టించిన ఈ చిత్రాన్ని త‌మిళంలో ప్రేమ్ కుమార్ తెర‌కెక్కించారు. త‌మిళంలో సినిమా ఘ‌న విజయాన్ని సాధించింది. దీన్ని తెలుగులో రీమేక్ చేయాల‌నుకున్న దిల్‌రాజు.. తెలుగు నెటివిటీకి త‌గిన‌ట్లు మార్పులు చేర్పులు చేయించి సెట్స్ పైకి తీసుకెళ్లారు. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి పాత్ర‌ను తెలుగులో శ‌ర్వానంద్ చేస్తుండ‌గా, త్రిష పాత్ర‌ను స‌మంత పోషిస్తున్నారు. ఈ ఏడాది చివ‌ర‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి దిల్‌రాజు ప్లాన్ చేస్తున్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. హీరోయిన్ పేరునే తెలుగులో టైటిల్‌గా ఖ‌రారు చేసిన‌ట్లు స‌మంత మెసేజ్ ఆధారంగా అర్థ‌మ‌వుతుంది. 

Get Breaking News Alerts From IndiaGlitz