జగన్ సమక్షంలో వైసీపీలోకి శైలజానాథ్


Send us your feedback to audioarticles@vaarta.com


మాజీ మంత్రి శైలజానాధ్ ఈరోజు వైసీపీలో చేరారు. అధినేత జగన్ సమక్షంలో ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. స్వయంగా జగన్ పార్టీ కండువా కప్పి శైలజానాధ్ ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు శైలజానాధ్.
జగన్ నాయకత్వంలో పనిచేస్తూ, కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు శైలజానాధ్. కూటమి ప్రభుత్వం సూపర్-సిక్స్ అమలు చేయడం లేదని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ల తరఫున పోరాడతానని అన్నారు.
గతంలో జగన్ విద్యా రంగంలో అమలు చేసిన అనేక సంస్కరణలను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టిందని... ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని... రాయలసీమ జిల్లాల్లో రైతుల కష్టాలను కూడా చంద్రబాబు ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నుంచి 2004, 2009 లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు శైలజానాధ్. పాఠశాల విద్యా శాఖ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర విభజన సమయంలో శైలజానాధ్ కీలక పాత్ర పోషించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments