close
Choose your channels

టాప్ హీరోయిన్ రెమ్యునరేషన్ తీసుకున్న సాహో ‘బ్యాడ్ భామ’!

Tuesday, August 20, 2019 • తెలుగు Comments

టాప్ హీరోయిన్ రెమ్యునరేషన్ తీసుకున్న సాహో ‘బ్యాడ్ భామ’!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, శ్రద్దా కపూర్ నటీనటులుగా సుజిత్ తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌తో పాటు పలువురు పాత్రలు, టీజర్ సినీ ప్రియుల్లో ఎంతో ఆసక్తిని పెంచేశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ న్యూస్‌ హైలైట్‌గా నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా రెమ్యునరేషన్ విషయంలో ప్రతీసారి సాహో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

ఇప్పటికే ప్రభాస్, శ్రద్దా రెమ్యునరేషన్లపై పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేసిన విషయం విదితమే. అయితే తాజాగా ఐటమ్ సాంగ్‌  ‘బ్యాడ్ బోయ్’లో నర్తించిన బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్  రెమ్యునరేషన్ గట్టిగానే తీసుకుందట. అంతా ఇంతా కాదండోయ్.. ఏకంగా రెండు కోట్లు డిమాండ్ చేసి మరీ తీసుకుందట. సింగిల్ సాంగ్‌కు రెండు కోట్లా అని దర్శక నిర్మాతలు ఆశ్చర్యపోయినప్పటికీ ఇవ్వక తప్పలేదట. తెలుగులో టాప్ హీరోయిన్లే ఒక్కో సినిమా కోసం ఇంత మొత్తం తీసుకోవట్లేదే.. ఒక్క ఐటమ్ సాంగ్‌ ఈ రేంజ్‌లో తీసుకోవడమా..? సినీ ప్రియులే కాదు.. టాలీవుడ్ నటీనటులు సైతం ఆశ్చర్యపోతున్నారట. అయితే.. ఈ వార్తలో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz