close
Choose your channels

'ఆర్ఆర్ఆర్' రిలీజ్ .. ద‌స‌రాకు ఫిక్స్‌..!

Monday, January 25, 2021 • తెలుగు Comments

ఆర్ఆర్ఆర్ రిలీజ్ .. ద‌స‌రాకు ఫిక్స్‌..!

మోస్ట్ అవెయిటెడ్ మూవీ ఆఫ్ ప్యాన్ ఇండియా `ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)` సినిమా విడుద‌ల‌కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. ప్రీ ఇండిపెండెన్స్ ముందు అంటే 1920 బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుంది. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఇందులో తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ పాత్ర‌లో న‌టిస్తుంటే, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇద్ద‌రు స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల‌కు సంబంధించిన క‌ల్పిత క‌థాంశంతో రూపొందుతోన్న చిత్రం. ఈ సినిమాను ఈ ఏడాది ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు అధికారికంగా ప్ర‌క‌టించారు.

``అగ్ని, నీరు క‌లిసి ఎదురులేని శ‌క్తిగా మీ ముందుకు అక్టోబ‌ర్‌లో రాబోతున్నాయి`` అంటూ రాజ‌మౌళి, రామ్‌చ‌ర‌ణ్ ట్వీట్ చేశారు. దీనిపై రానా ద‌గ్గుబాటి త‌దిత‌రులు వావ్ అంటూ త‌మ స్పంద‌న‌ను తెలియ‌జేస్తున్నారు. ప్రేక్ష‌కాభిమానులే కాదు.. యావ‌త్ ఇండియ‌న్ మూవీ ఇండ‌స్ట్రీ ఈ సినిమా గురించి ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఎదురుచూపుల‌కు అక్టోబ‌ర్ 13న ఫ‌లితం ద‌క్క‌నుంది. ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో పాటు ఇతర కీలకపాత్రల్లో నటిస్తోన్న బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌, అలిస‌న్ డూడి, రే స్టీవెన్ స‌న్‌, ఒలివియా మోరిస్, స‌ముద్ర‌ఖ‌ని త‌దిత‌రులు న‌టిస్తున్నారు. రూ.450 కోట్ల రూపాయల భారీ బడ్టెట్‌తో, భారీ ప్యాన్‌ ఇండియా తారాగణంతో రూపొందుతోంది,

Get Breaking News Alerts From IndiaGlitz