డీ-లిమిటేషన్ పై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు


Send us your feedback to audioarticles@vaarta.com


కేంద్రం తలపెడుతున్న డీ-లిమిటేషన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కేవలం దక్షిణాది రాష్ట్రాలపై ప్రతీకారం తీర్చుకోవడం తప్ప మరోటి కాదన్నారు. ఈ అంశంపై ఏకపక్షంగా వెళ్లకుండా, అఖిలపక్షం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి.
ఇండియాటుడే కాన్ క్లేవ్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. దక్షిణాదిన బీజేపీకి ప్రాతినిధ్యం లేదని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ లో కేవలం భాగస్వామిగా మాత్రమే ఉందన్నారు. ప్రతిసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి పరాభవం ఎదురవ్వడంతో, కక్షసాధింపు చర్యగా డీ-లిమిటేషన్ ను తెరపైకి తీసుకొచ్చిందని ఆరోపించారు రేవంత్.
దశాబ్దాల కిందట కేంద్రం ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేశారని.. కాబట్టి ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిన జనాబా తక్కువగా ఉందన్నారు. ఇలాంటి టైమ్ లో జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపు సమంజసం కాదన్నారు.
ఇదే డీ-లిమిటేషన్ ప్రక్రియను మరో 30 ఏళ్ల తర్వాత చేపడితే అప్పుడు పరిస్థితిలో మార్పు వస్తుందన్నారు. జనాభా ప్రాతిపదికన కాకుండా, ప్రొ రేటా విధానంలో సీట్ల పెంపు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments