close
Choose your channels

BiggBoss: బిగ్‌బాస్ ఇంట్లో ‘‘దెయ్యం’’ .. శ్రీహాన్ దుప్పట్లోకి దూరిన శ్రీసత్య, ప్రైజ్‌మనీ వేటలో రేవంత్

Wednesday, December 7, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ తెలుగు 6 తుది అంకానికి చేరుకున్న సంగతి తెలిసిందే. మరో రెండు వారాల్లో ఈ సీజన్ విజేత ఎవరో తేలిపోనుంది. సోమవారం నామినేషన్స్‌ కూడా వెరైటీగా ప్లాన్ చేసిన బిగ్‌బాస్... ఈ వారం కెప్టెన్ వుండకపోవడంతో కొత్త కొత్త టాస్క్‌లు ఆడిస్తున్నాడు. అప్పట్లో రకరకాల సాకులు చెప్పి ప్రైజ్ మనీలో కోత పెట్టాడు బిగ్‌బాస్. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడం, ప్రస్తుతం కంటెస్టెంట్స్‌ నుంచి ఎలాంటి కంటెంట్ ఇవ్వాలో తెలియకపోవడంతో ఆ ప్రైజ్‌మనీని తిరిగి ఇచ్చేస్తానని ఛాలెంజ్‌లు విసురుతున్నాడు. దీంతో ఇంటి సభ్యులు కసితీరా ఆడాలని నిర్ణయించుకున్నారు.

ముఖ్యంగా ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం చాలా సొమ్మును పణంగా పెట్టాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైజ్ మనీని పెంచుకోవాలని అంతా డిసైడ్ అయ్యారు. అయితే ఈ ఛాలెంజ్‌ల్లో ఎవరు పాల్గొంటారు అనే విషయాన్ని ఇంటి సభ్యులే ఏకాభిప్రాయంతో నిర్ణయించుకోవాలని, కేవలం ఇద్దరు మాత్రమే టాస్క్‌ల్లో పాల్గొనాలని కండీషన్ పెట్టాడు బిగ్‌బాస్. అలాగే ఆ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో కూడా ఓ నిర్ణయానికి వచ్చి దానిని సీక్రెట్‌గా వుంచాలని ఆదేశించాడు. టాస్క్‌లో గెలిచిన వారు, ఇంటి సభ్యులు గెలుస్తారని అనుకున్న కంటెస్టెంట్ ఇద్దరూ ఒకటే అయితే ఈ ఛాలెంజ్‌ గెలిచినట్లే.

నిన్నటి ఎపిసోడ్‌లో శ్రీసత్య, రోహిత్ పోటీపడగా.. ఫిజికల్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. స్వతహాగా రోహిత్ స్ట్రాంగ్ కాబట్టి అతనే గెలుస్తాడని ఇంటి సభ్యులంతా ఫిక్స్ అయ్యారు. కానీ ఊహించని విధంగా శ్రీసత్య గెలవడంతో బిగ్‌బాస్ నిబంధన ప్రకారం.. ఇంటి సభ్యులు ఛాలెంజ్ ఓడిపోయారు. దీంతో రూ.1,10,000 మొత్తాన్ని వెనక్కి రప్పించలేకపోయారు. అయితే ఈ రోజు మాత్రం అలాంటి పొరపాటు చేయకూడదని కంటెస్టెంట్స్ డిసైడ్ అయ్యారు. మంగళవారం జరిగిన టాస్క్‌లో రేవంత్, ఇనయాలు పాల్గొన్నారు. వీరిద్దరికి పిరమిడ్ ఛాలెంజ్ ఇచ్చారు బిగ్‌బాస్. వీరిద్దరూ టేబుల్‌పై పేపర్ గ్లాసులతో పిరమిడ్ పేర్చి దానిని పడిపోకుండా పక్కనే వున్న మరో టేబుల్‌పైకి తీసుకెళ్లాలి. ఇంటి సభ్యులంతా రేవంత్ ఖచ్చితంగా గెలుస్తాడనే ఏకాభిప్రాయంతో వున్నారు. చివరికి పోటీలోనూ అతనే గెలవడంతో రూ.1,10,000 మొత్తం ప్రైజ్ మనీలోకి యాడ్ అయ్యింది.

తర్వాత టాస్క్ కోసం ఈసారి రెండు జంటలకు అవకాశం ఇచ్చారు బిగ్‌బాస్. ఇంటి సభ్యులు ఏకాభిప్రాయంతో ఎవరెవరు పోటీపడతారో తేల్చుకోవాలని చెప్పాడు. దీంతో ఆదిరెడ్డి- కీర్తి, శ్రీహాన్ - శ్రీసత్యలను కంటెస్టెంట్స్ ఎంపిక చేశారు. నగదు మొత్తం రాసిన బోర్డులను, చేత్తో ముట్టుకోకుండా కర్రలతో జాగ్రత్తగా బాక్స్‌లో వేయాలి. అంతా ఆదిరెడ్డి టీమ్ గెలుస్తుందని భావించగా, శ్రీహాన్- శ్రీసత్యలు గెలవడంతో రూ.1,10,000 పోయాయి.

అయితే నాలుగో రౌండ్‌లో మాత్రం ఏకంగా రూ.2 లక్షల నగదు ఇస్తానని ఛాలెంజ్ విసిరాడు బిగ్‌బాస్. దీంతో మరోసారి రేవంత్, ఇనయాలు పోటీపడగా, కీర్తి సంచాలక్‌గా వ్యవహరించింది. ఒక ఇసుక మూటను వేలాడదీసి.. దాని కింద రంధ్రం పెట్టారు. అలాగే ఆ మూట కింద రెండు డబ్బాలు పెట్టారు. రేవంత్, ఇనయాలు గ్లౌవ్స్ వేసుకుని ఇసుక మూటకు పంచ్ ఇస్తే ఇసుక కింద పడుతుంది. ఎవరి డబ్బాలో అయితే ఎక్కువ ఇసుక వుంటుందో వారు గెలిచినట్లు. ఎప్పటిలాగే రేవంత్ గెలుస్తాడని ఇంటి సభ్యులంతా భావించారు. అనుకున్నట్లుగానే టాస్క్‌లో రేవంత్ గెలవడంతో రూ.2 లక్షల నగదు ... ప్రైజ్‌మనీకి యాడ్ అయ్యింది.

ఇదిలావుండగా.. మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ఇంట్లో హార్రర్ కథా చిత్రం నడిచింది. అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీసత్య.. ఇంటి సభ్యులందరినీ కూర్చోబెట్టి తన జీవితంలో జరిగిన దెయ్యం కథను చెప్పింది. మా బుడ్డదాని బర్త్ డే కోసం ఫాంహౌస్‌ తీసుకున్నామని... పార్టీ ముగిసిన తర్వాత అంతా నిద్రపోయామని, కానీ మాతో పాటు వున్న ఒక అబ్బాయి నడుచుకుంటూ వింత శబ్ధం చేసుకుంటూ ఫారెస్ట్‌లోకి వెళ్లిపోతున్నాడని చెప్పింది. ఎన్నిసార్లు అతనిని తీసుకొచ్చి రూంలో పడుకోబెట్టినా మళ్లీ అడవిలోకి వెళ్లిపోయాడని చెప్పింది. ఈ క్రమంలో ఎవరో నవ్వినట్లుగా శబ్ధం రావడంతో శ్రీసత్య ఒక్క ఉదుటున వెళ్లి శ్రీహాన్ దుప్పట్లోకి దూరిపోయింది. తీరా .. అది దెయ్యం కాదని, మనుషులని ఇనయా చెప్పడంతో అంతా నవ్వేశారు.

ఈ సంఘటన తర్వాత ఇంటి సభ్యులకు నిద్రపట్టలేదు. అంతా దెయ్యాన్ని చెక్ చేసే పనిలో పడ్డారు. శ్రీహాన్, ఆదిరెడ్డిలు లగేజ్ రూం వైపు వెళ్లగా, వారి వెనకే మిగిలిన ఇంటి సభ్యులు వెళ్లారు. అంతే తనకు దెయ్యం కనపడిందంటూ ఇనయా పరిగెత్తుకొచ్చేసింది. ఆ కాసేపటికే ఇనయా దెయ్యం పట్టినదానిలా అరుపులు, కేకలు గట్టిగా నవ్వుతూ భయపెట్టింది. ఈ దెయ్యం ఎపిసోడ్‌తో శ్రీహాన్ బాగా భయపడిపోయాడు. చివరికి బాత్‌రూంకి వెళ్లేందుకు కూడా భయపడ్డాడు. మొత్తం మీద ఈరోజు సరదాగా సాగిపోయింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.