close
Choose your channels

మళ్లీ కెమెరా ముందుకు రేణు దేశాయ్..

Monday, September 21, 2020 • తెలుగు Comments

మళ్లీ కెమెరా ముందుకు రేణు దేశాయ్..

నటి రేణూ దేశాయ్ మళ్లీ కెమెరా ముందుకు వచ్చారు. ఆమె ఓ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విశేషాలన్నీ త్వరలోనే ప్రకటిస్తానని స్వయంగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఫోటో షూట్‌లో తీసిన స్టిల్‌ను కూడా ఆమె షేర్ చేసిన రేణు.. మళ్లీ కెమెరా ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. వచ్చే నెల నుంచి తను నటించబోయే వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కాబోతోందన్నారు. ఈ ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు కావాలన్నారు.

వెబ్ సిరీస్‌లో తన పాత్ర గురించి రేణు మాట్లాడుతూ.. న్యాయం కోసం పోరాడే ఓ బలమైన మహిళ పాత్రలో తాను నటిస్తున్నానని రేణు తెలిపారు. ఎమ్.ఆర్. కృష్ణ మామిడాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌ను సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై డీఎస్ రావు, రజనీకాంత్ నిర్మిస్తున్నారు. రేణు నటిగానే కాకుండా దర్శకురాలిగా.. నిర్మాతగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆమె ‘అన్నదాత సుఖీభ’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz