close
Choose your channels

Tiger Nageswara Rao:‘‘పులుల్ని వేటాడే పులిని చూశావా ’’: గజదొంగగా భయపెడుతోన్న రవితేజ , 'టైగర్ నాగేశ్వరరావు' ఫస్ట్ లుక్ గ్లింప్స్ సూపర్బ్

Wednesday, May 24, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ మంచి జోరులో వున్నారు. 50 ప్లస్‌లోనూ కుర్ర హీరోల కంటే స్పీడుగా సినిమాలు చేస్తున్నారు. వాల్తేర్ వీరయ్య, ధమాకాల హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్న ఆయన ఆ వెంటనే రావణాసురను రిలీజ్ చేశాడు. కానీ ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. హిట్టు ఫ్లాప్‌లను ఏమాత్రం పట్టించుకోని రవితేజ తాను నమ్ముకున్న మార్గంలో సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోతారు. తాజాగా ఆయన నటిస్తోన్న చిత్రం ‘‘టైగర్ నాగేశ్వరరావు’’. ఈ సినిమాను వంశీ తెర‌కెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో రేణు దేశాయ్ ఒక కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

ఐదుగురు స్టార్స్ చేతుల మీదుగా ఫస్ట్ లుక్ గ్లింప్ప్ :

ఇప్పటికే రిలీజైన పోస్టర్స్ , ప్రీ లుక్‌లకు మంచి స్పందన రావడంతో పాటు ఈ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ రోజు టైగర్ నాగేశ్వరరావు మూవీ నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. దీనికి విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. అంతేకాదు.. ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను హిందీలో సల్మాన్ ఖాన్, కన్నడలో శివరాజ్ కుమార్ , మలయాళంలో మోహన్ లాల్, తమిళంలో రజినీకాంత్‌లు విడుదల చేశారు.

దడదడ మంటూ వెళ్లే రైలు కూడా గజగజ వణుకుతుంది:

ఇక గ్లింప్స్ విషయానికి వస్తే .. ‘‘ అది 70వ దశకం.. బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఒక చిన్న గ్రామం. ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా అక్కడి జనాలను చూసి భయపడుతుంది. దడ దడ మంటూ వెళ్లే రైలు ఆ ప్రాంతం పోలిమేర రాగానే గజగజ వణుకుతుంది. ఆ ఊరు మైలు రాయి కనపడితే జనం అడుగులు తడబడతాయి. దక్షిణ భారతదేశం నేర రాజధాని , ద క్రైమ్ క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా ‘‘స్టూవర్ట్ పురం’’.. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా వుంది ‘‘టైగర్ జోన్’’.. ద జోన్ ఆఫ్ టైగర్ నాగేశ్వరరావు ’’. అంటూ హీరో క్యారెక్టరైజేషన్‌ను అద్భుతంగా ఎలివేట్ చేశారు. ఆ వెంటనే ‘‘జింకల్ని వేటాడే పులుల్ని చూసుంటావు.. పులుల్ని వేటాడే పులిని ఎప్పుడైనా చూశావా అంటూ ’’ రవితేజ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్‌తో గ్లింప్స్ ముగుస్తుంది. మొత్తం మీద ఈ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకునేలా వున్నారు రవితేజ.

దసరా కానుకగా టైగర్ నాగేశ్వరరావు:

టైగర్ నాగేశ్వరరావులో రవితేజ సరసన గాయత్రి భరద్వాజ్, నూపూర్ సనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, రేణూ దేశాయ్, జిషు సేన్ గుప్తాలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ పిక్చర్ నిర్మిస్తోన్న ఈ సినిమాను దసరా కానుకగా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Login to post comment
Cancel
Comment