close
Choose your channels

Bigg Boss 7 Telugu : బిగ్‌బాస్ నుంచి రతిక ఎలిమినేట్.. చూస్తూ ఊండిపోయిన పల్లవి ప్రశాంత్, పట్టించుకోని శివాజీ

Monday, October 2, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

అనుకున్నదే అయ్యింది బిగ్‌బాస్ హౌస్ నుంచి రతిక ఎలిమినేట్ అయ్యింది. ఆమె ఇంటిని వీడతారని ముందు నుంచే ప్రచారం జరిగింది. దీంతో వరుసగా నాలుగో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినట్లయ్యింది. ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీలా, దామినిలు హౌస్‌ను వీడిన సంగతి తెలిసిందే. ఇక శనివారం ఇంట్లో చోటు చేసుకున్న ఘటనలతో శివాజీ బాగా హర్ట్ అయ్యాడు. అంతా కలిసి తనను అనర్హుడిగా ప్రకటించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున రాగానే ఆయనను శివాజీ ఇదే విషయంలో నిలదీశాడు.

శివాజీని నామినేట్ చేసిన శోభాశెట్టి, గౌతమ్, ప్రియాంకలను రీజన్స్ చెప్పాల్సిందిగా నాగ్ ప్రశ్నించాడు. దీనికి ఎవరికి వారు తమ కారణాలను తెలియజేశారు. కానీ అవేవి సరైన రీజన్స్‌గా అనిపించడం లేదని నాగార్జున మండిపడ్డారు. కానీ హౌస్‌మెట్స్ అంతా కలిసి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించాల్సిందేనని శివాజీకి తేల్చిచెప్పాడు. ఈ వివాదం సద్దుమణగడంతో సండే గేమ్స్‌ స్టార్ట్ చేశారు నాగార్జున . దీనిలో భాగంగా ‘‘బొమ్మ గీయ్ గెస్ చేయ్’’ అనే ఆట పెట్టారు. కంటెస్టెంట్స్‌ను రెండు జట్లుగా విభజించి.. ఒక టీమ్ మెంబర్ వచ్చి బౌల్‌లోని స్లిప్ తీసి అందులోని పేరు ఆధారంగా బోర్డుపై బొమ్మ గీయాలి. ఆ వ్యక్తికి చెందిన జట్టు సభ్యులు.. బొమ్మ ఆధారంగా ఆ పేరు గెస్ చేయాలి. ఈ ఆటలో బీ టీమ్ (అమర్‌దీప్, ప్రియాంక, యువర్, శోభాశెట్టి, ప్రశాంత్) విజయం సాధించింది.

గేమ్‌లు పెడుతూనే మధ్య మధ్యలో నామినేషన్స్‌లో వున్న వారిని సేవ్ చేస్తూ వచ్చారు నాగార్జున. చివరికి తేజ , రతిక మాత్రమే మిగిలారు. వారిద్దరిని యాక్టివిటీ రూంకి పిలిచారు. ఇద్దరి చేతిలో రెండు బ్లాస్టింగ్ గన్స్ పెట్టి.. కౌంట్‌డౌన్ ముగియగానే ఎవరి గన్ బ్లాస్ట్ అవుతుందో వారు సేఫ్ అని చెప్పారు. తేజ గన్ బ్లాస్ట్ అవ్వగా.. రతిక గన్ బ్లాస్ కాలేదు. దీంతో హౌస్‌మెట్స్ అంతా షాక్ అయ్యారు. ఇంటిని వీడుతున్నందుకు రతిక కంటతడి పెట్టింది. స్టేజ్‌పై తన జర్నీని చూసుకుని ఆమె మరింత ఎమోషనల్ అయ్యింది. అనంతరం కంటెస్టెంట్స్‌లో నచ్చని ఒక్కొక్క లక్షణాన్ని చెప్పి రతిక అందరికీ వీడ్కోలు చెప్పింది.

రతిక ఎలిమినేట్ అయినప్పుడు అంతా ఎమోషనల్ అవ్వగా.. పల్లవి ప్రశాంత్ మాత్రం ఆమెను సైలెంట్‌గా అలా చూస్తూ వుండిపోయాడు. ఇక స్టేజ్‌పై శివాజీని అందరితో సమానంగా వుండమని సలహా ఇచ్చింది రతిక. అయితే ఆమె మాటలను శివాజీ పెద్దగా పట్టించుకున్నట్లుగా కనిపించలేదు. రతిక ఎలిమినేట్ అయి వెళ్లిపోతున్నప్పుడు కనీసం ఆమెను పలకరించలేదు శివాజీ. అలా బిగ్‌బాస్ 7 తెలుగు విజయవంతంగా నాలుగు వారాలు కంప్లీట్ చేసుకుని ఐదో వారంలోకి అడుగుపెట్టింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.