close
Choose your channels

BiggBoss Telugu 7 : శివాజీ, రతికలకు అదృష్టం దక్కనివ్వని కంటెస్టెంట్స్.. భయపెట్టిన షకీలా

Saturday, September 9, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

చూస్తుండగానే బిగ్‌బాస్ 7 వీకెండ్‌కు చేరుకుంది. తొలివారం నామినేషన్స్ జరగగా.. గేమ్‌ను రక్తి కట్టించడానికి కంటెస్టెంట్స్‌ కిందా మీద పడుతున్నారు. బిగ్‌బాస్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్ధితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆశించిన మేర వర్కవుట్ కావడం లేదు. నిన్న హీరో శివాజీ కాఫీ కోసం కాస్త ఓవర్ యాక్షన్ చేశాడు. కొద్దోగొప్పో జనానికి ఇది బాగానే నచ్చిందట. ఇమ్యూనిటీ టాస్క్‌లో ఎవరు విన్నర్ అనే విషయాన్ని కంటెస్టెంట్సే తేల్చుకోవాలని రూల్ పెట్టడంతో ఇంట్లో వాతావరణం వేడెక్కింది.

ఫేస్ ది బీస్ట్ అంటూ ఇమ్యూనిటీ టాస్క్‌ను తీసుకొచ్చిన బిగ్‌బాస్.. ఇందులో గెలిచిన వారికి ఏకంగా ఐదు వారాల పాటు ఇంట్లో వుండే అవకాశం వుంటుందని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్ బాడీ బిల్డర్స్‌తో తమ శక్తి మేర కుస్తీ పట్టారు. ఇందుల్లో అబ్బాయిల తరపున ఆట సందీప్, అమ్మాయిల తరపున ప్రియాంక జైన్ బాగా ఆడి ఫైనల్‌కు చేరుకున్నారు. మిగిలినవారు తమకు అవకాశం లేకపోవడంతో ఎలా రా అనుకుంటున్న దశలో బిగ్‌బాస్ మరో ఆఫర్ ఇచ్చాడు. తనను ఎవరైతే ఇంప్రెస్ చేస్తారో వారికి ఇమ్యూనిటీ టాస్క్‌లో ముందుకెళ్లే అవకాశం కల్పిస్తానని చెప్పాడు.

బిగ్‌బాస్ పెట్టిన టాస్క్‌లో రతిక, శివాజీ గెలిచి.. సందీప్, ప్రియాంక జైన్‌తో తలపడటానికి సిద్ధమయ్యారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ నలుగురిలో ఇమ్యూనిటీకి అర్హత లేని వారు ఎవరో డిసైడ్ చేయాల్సిందిగా కంటెస్టెంట్స్‌ని కోరాడు. చాలా సులభంగా ఇమ్యూనిటీ పవర్ టాస్క్‌లోకి దూసుకొచ్చిన రతిక, శివాజీలు అర్హులు కాదని ఇంటి సభ్యులు తేల్చి చెప్పడంతో వీరిద్దరూ పోటీ నుంచి తప్పుకున్నారు. తనకు జరిగిన అన్యాయానికి శివాజీ రగిలిపోయాడు. పెద్దరికం కావడంతో ఏవేవో సామెతలు చెప్పడం మొదలెట్టాడు. దీనికి కంటెస్టెంట్స్ మాకెందుకు ఇదంతా అంటూ తలపట్టుకున్నారు.

ఈరోజు హైలెట్‌గా నిలిచిన కంటెస్టెంట్ షకీలా. చాలా మెచ్యూర్డ్‌గా ఆడుతూ, తన పని తాను చేసుకుంటూ పోతున్నారామె. రాత్రయ్యాక ఒక్కసారిగా నిద్రలోంచి లేచి విశ్వరూపం చూపించింది. సీరియస్‌గా ఫేస్ పెట్టి.. కూర్చొని కళ్లు పెద్దవి చేసింది. ఆమెను ఆ లుక్‌లో చూసి కంటెస్టెంట్స్ అంతా వణికిపోయారు. ఇదంతా శివాజీ డైరెక్షన్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది.

ఇక బిగ్‌ బాస్‌ తెలుగు 7న మొదటి వారం నామినేషన్‌లో ఉన్న ఒకరు ఎలిమినేట్‌ అయ్యే సమయం వచ్చింది. ఈ వారం దామిని, గౌతమ్‌ కృష్ణ, కిరణ్‌ రాథోడ్, పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్ యావర్, రతిక, షకీలా, శోభా శెట్టి నామినేషన్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు నామినేట్‌ అవుతారనేది తెలియాల్సి ఉంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.