'స్టార్ మా' లో రాణి రుద్రమ!!
పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ పౌరుషాన్ని, వీరవిక్రమాల్ని ఓరుగల్లు కోట బురుజులపై కాకతీయ పతాకంలా ఎగరేసిన సాహస నారి, సంచలనాల విజయభేరి “రుద్రమదేవి కథను ఇప్పుడు ప్రేక్షకులకు ఒక విశిష్టమైన ధారావాహికగా అందిస్తోంది తెలుగువారి అభిమాన ఛానల్ “స్టార్ మా”.
అచ్చమైన ఈ తెలుగు కథను కేవలం తెలుగువారి కోసం మాత్రమే ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దింది. భారీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్ మా అందించబోతున్న ఈ సీరియల్ తెలుగు టెలివిజన్ వ్యూయింగ్ పరంగా కొత్త అధ్యాయం సృష్టించబోతోంది. సరికొత్త అనుభూతిని పంచబోతోంది.
వీరోచితమైన కథల్ని, స్పూర్తి నిచ్చే గాధల్ని వినూత్నరీతిలో అందించి ఎన్నో విజయాల్ని అందుకున్న స్టార్ మా ఛానెల్ ఇప్పుడు భారీ ప్రయత్నంగా “రుద్రమదేవి” కథని మరపురాని స్పాయిలో అందిస్తోంది. ఈ మెగా ప్రాజెక్ట్ 'రుద్రమదేవి" స్టార్ మా లో జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు ఆరంభమవుతోంది.
ఇది కేవలం మన కథ మాత్రమే కాదు. రానున్న ఎన్నో తరాలు చెప్పుకో దగ్గ కథ. మనం గుర్తుంచుకోదగ్గ కథ. ఎప్పటికీ స్పూర్తినిచ్చే కథ. ఇంతకుముందు ఎన్నడూ బుల్లితెరపై కనిపించని ప్రమాణాలతో..ఈ తరానికి కూడా అందాలన్నదే 'స్టార్ మా ప్రయత్నం.
రద్రమదేవి ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://youtu.be/skLfg0BBq7w
Press release by: Indian Clicks, LLC