close
Choose your channels

Ram Charan:చిరంజీవి @ 45 Years of Industry.. రాం చరణ్ స్పెషల్ పోస్ట్ , వైరల్

Friday, September 22, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారుండరు. స్వయంకృషి, పట్టుదల, క్రమశిక్షణతో ఎలాంటి గాడ్ ఫాదర్ లేకుండా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదిగారు. దాదాపు మూడు దశాబ్ధాల పాటు టాలీవుడ్‌ను మకుటం లేని మహారాజుగా ఏలారు. ఒకానొక దశలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్‌ను మించిన స్థార్‌గా, ఆయన కంటే ఎక్కువ పారితోషికం తీసుకునే నటుడిగా చిరంజీవి సంచలనం సృష్టించారు. అయితే ఎంత ఎదిగినా ఒదిగివుండే తత్వం, మంచితనం, మానవత్వం మెగాస్టార్ సొంతం. అందుకే ఆయనను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది హీరోలు, టెక్నీషియన్లు వెండితెరపైకి వచ్చారు.. వస్తున్నారు.

1978 సెప్టెంబర్ 22న విడుదలైన ప్రాణం ఖరీదు :

చిరు జీవితంలో ఆగస్ట్ 22, సెప్టెంబర్ 22లకు ప్రత్యేక స్థానం వుంది. ఆగస్ట్ 22న ఆయన జన్మిస్తే.. సెప్టెంబర్ 22న మెగాస్టార్ నటుడిగా జన్మించిన రోజు. ఆ రోజున తెలుగు ప్రేక్షకులకు చిరంజీవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. మెగాస్టార్ వెండితెరపై కనిపించిన తొలి చిత్రం ‘‘ప్రాణం ఖరీదు’’ 1978 సెప్టెంబర్ 22న విడుదలైంది. అలా నటుడిగా చిరంజీవి 45 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రికి సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశారు. అలాగే చిరంజీవి నటించిన సినిమాల్లో ఆయన స్టిల్స్‌తో కూడిన ఫోటోను ‘‘45 years of mega journey in cinema ’’ అంటూ పోస్ట్ చేశారు.

థ్యాంక్స్ నాన్న అంటూ చరణ్ పోస్ట్ :

‘‘మీరు తెరపై నటనతో, తెర వెనుక వ్యక్తిత్వంతో ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తూనే వున్నారు. అంకిత భావం, కష్టపడే తత్వం, క్రమశిక్షణ వంటివి నాలో పెంపొందినందుకు థ్యాంక్స్ నాన్న’’ అంటూ చరణ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాభిమానులు, సినీ ప్రముఖులు చిరంజీవికి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.