close
Choose your channels

కుటుంబంతో కలిసి ఆనందంగా దీపావళిని జరుపుకున్న రాజశేఖర్

Sunday, November 15, 2020 • తెలుగు Comments

హీరో రాజశేఖర్ కరోనా నుంచి కోలుకుని ఇటీవల ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే. ఆయన డిశ్చార్జ్ అయిన అనంతరం వచ్చిన తొలి పండుగ అయిన దీపావళిని రాజశేఖర్ తన భార్య జీవిత, పిల్లలు శివాని, శివాత్మికలతో కలిసి సంతోషంగా జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను శివాత్మిక ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫోటోల్లో రాజశేఖర్ చాలా ఆనందంగా కనిపించారు. తన తండ్రి కోలుకుంటున్నారని చెబుతూ శివాత్మిక ట్వీట్ చేసింది.

‘‘మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నాన్న కోలుకుంటున్నారు. మీ అందరి ప్రేమకు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. క్షేమంగా ఉండండి. లోడ్స్ ఆఫ్ లవ్’’ అంటూ శివాత్మిక ట్వీట్ చేసింది. ఇటీవల రాజశేఖర్‌తో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. అయితే రాజశేఖర్ మినహా మిగిలిన వారంతా త్వరగానే కోలుకున్నారు. ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్‌గా మారింది. వైద్యుల కృషి, అభిమానుల ప్రార్థనలు ఫలించి ఆయన క్షేమంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Get Breaking News Alerts From IndiaGlitz