close
Choose your channels

ర‌జినీ 168 టైటిల్‌..!!

Monday, January 27, 2020 • తెలుగు Comments

ర‌జినీ 168 టైటిల్‌..!!

ద‌ర్బార్ సినిమా త‌ర్వాత సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు. వెంట‌నే డైరెక్ట‌ర్ శివ‌తో సినిమాను స్టార్ట్ చేశాడు. ర‌జినీ కాంత్ 168వ చిత్ర‌మిది. హీరోలను మాస్‌గా చూపించడంలో శివ స్పెషలిస్ట్‌. అందుకనే కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ శివతో వరుసగా వీరం, వేదాళం, వివేకం, విశ్వాసమ్‌ సినిమాలను చేశాడు. ఇప్పుడు రజనీకాంత్‌తో శివ సినిమా అనగా మాస్‌ ఇమేజ్‌ ఉన్న రజనీకాంత్‌ను శివ ఎలా చూపిస్తాడో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరగుతున్నాయి. ఈ చిత్రానికి `వ్యూహం` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు వార్త‌లు విన‌ప‌డ్డాయి. అయితే ఈ వార్త‌ల‌ను కోలీవుడ్ వ‌ర్గాలు కొట్టిప‌డేశాయి.

తాజా స‌మాచారం ప్రకారం ఈ చిత్రానికి `అన్నాత్త‌` అనే టైటిల్‌ను ఖ‌రారు చేస్తార‌ని.. త్వ‌ర‌లోనే అధికారిక స‌మాచారం వెలువ‌డుతుందట‌. సినిమాలో హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌లో నుండే ఈ టైటిల్‌ను తీసుకున్నార‌ని టాక్‌. స‌న్‌పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా త‌ర్వాత ర‌జినీ హీరోగా లోకేశ్ క‌న‌క‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపొంద‌నుందట‌. శివ సినిమా పూర్తి కాగానే.. అంటే 2020 ద్వితీయార్థంలో ర‌జినీ 169 కూడా స్టార్ట్ అవుతుంద‌ని స‌మాచారం.

Get Breaking News Alerts From IndiaGlitz