close
Choose your channels

'రాజ రాజ చోర' టీజర్: శ్రీవిష్ణు కురిపించబోతున్న కామెడీ జల్లులు!

Friday, June 18, 2021 • తెలుగు Comments

రాజ రాజ చోర టీజర్: శ్రీవిష్ణు కురిపించబోతున్న కామెడీ జల్లులు!

ఎంతో ట్యాలెంట్ దాగిఉన్న యువ హీరో శ్రీ విష్ణు. క్యారెక్టర్ రోల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా కూడా సత్తా చాటుతున్నాడు. బ్రోచేవారెవరురా లాంటి హిట్ శ్రీ విష్ణు ఖాతాలో ఉంది. తాజాగా శ్రీ విష్ణు నటించిన చిత్రం 'రాజ రాజ చోర'. హాషిత్ గోలి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మాతలు. తాజాగా ఈ చిత్ర టీజర్ విడుదల చేశారు. దాదాపు 2 నిమిషాల నిడివి ఉన్న టీజర్ పూర్తి హాస్యభరితంగా ఉంటూ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా శ్రీవిష్ణు మంచి కామెడీ టైమింగ్ తో పేల్చుతున్న డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

శ్రీవిష్ణు దొంగ పాత్రలో నటిస్తున్నాడు. మేఘా ఆకాష్, సునైనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. రవిబాబు, తనికెళ్ళ భరణి, అజయ్ ఘోష్, గంగవ్వ కీలక పాత్రల్లో నటిస్తుండడం విశేషం. ఒక అద్భుతమైన ఫన్ రైడ్ లాంటి చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు 'రాజ రాజ చోర' టీజర్ చూస్తే అర్థం అవుతుంది.

శ్రీవిష్ణు హావభావాలు టీజర్ లో ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్ర విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz