close
Choose your channels

రాజ్‌తరుణ్‌ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడుగా!

Thursday, August 22, 2019 • తెలుగు Comments

రాజ్‌తరుణ్‌ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడుగా!

టాలీవుడ్ కుర్ర హీరో రాజ్‌తరుణ్‌ కారు సోమవారం రాత్రి నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. కారులో ఎయిర్‌ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో రాజ్ తరుణ్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కారును వదిలేసి అక్కడి నుండి పరుగులు తీసాడు. ఇప్పటి వరకూ ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజీ మాత్రమే పోలీసులు బయటపెట్టారు. అయితే మరో షాకింగ్ వీడియోస్.. ఫోన్ రికార్డింగ్స్ బయటికి రావడం గమనార్హం.

ఇదీ షాకింగ్..!
రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత కారు దృశ్యాలను స్థానికుడు కార్తిక్ అనే కుర్రాడు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. అదే టైమ్‌లో కారు దిగి పరుగులు తీస్తున్న హీరోను సైతం విలన్‌గా చేజింగ్ చేసి మరి పట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోల్లో తాను మద్యం సేవించి ఉన్నానని.. వదిలిపెట్టండి అని పదే పదే ఆ కుర్రాడ్ని బ్రతిమాలినట్లు ఉంది. ఆ తర్వాత ఘటనాస్థలంలో తీసిన వీడియోలు ఇవ్వాలంటూ రాజ్‌తరుణ్ స్నేహితులు మొదలుకుని ఆయన మేనజర్, ప్రముఖ నటుడు రాజారవీంద్ర కూడా తనను బెదిరిస్తున్నట్లు కార్తిక్‌ వాపోతున్నాడు.

ఐదు లక్షలిస్తాం..!
అంతేకాదు.. ఆ వీడియోలిస్తే.. రూ.5 లక్షల రూపాయలు ఇస్తామని కూడా ప్రలోభపెట్టినట్లు కార్తిక్ చెబుతున్నాడు. ఇవన్నీ అటుంచితే ప్రమాదం జరిగి మూడు రోజులు అయినప్పటికీ ఇంతవరకూ దీనికి సంబంధించి నార్సింగి పోలీసులు మాత్రం ఎలా స్పష్టతే కాదు.. కనీసం రాజ్‌తరుణ్‌ను విచారించకపోవడం గమనార్హం. కాగా.. ప్రమాదం అనంతరం ట్విట్టర్ వేదికగా స్పందించడంతో పాటు ఓ వీడియోను సైతం పోస్ట్ చేసి.. డ్రైవింగ్ చేసేవారికి ఈ హీరోగారు జాగ్రత్తలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారం ఎందాకా వెళ్తుందో..? ఇకనైనా పోలీసులు విచారిస్తారో లేదో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz