close
Choose your channels

ఈ వారం బిగ్ బాస్ షో లో ఇద్దరు బయటకు... ఈరోజు రాహుల్ ?

Saturday, September 21, 2019 • తెలుగు Comments

ఈ వారం బిగ్ బాస్ షో లో ఇద్దరు బయటకు... ఈరోజు రాహుల్ ?తెలుగులో ప్ర‌సార‌మ‌వుతున్న బిగ్‌బాస్ 3 లో ఇప్ప‌టికే 7 ఎలిమినేష‌న్స్ జ‌రిగాయి. ఈ వారం మ‌హేశ్‌, హిమ‌జ‌, రాహుల్ ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయ్యారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు పాత ప‌ద్ధ‌తుల్లోనే ఎలిమినేష‌న్ చేస్తూ వ‌చ్చిన బిగ్‌బాస్ ఈసారి మాత్రం హౌస్‌మేట్స్‌కు షాకిచ్చాడు. దానికి సంబంధించిన ప్రోమో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. ఇంత‌కు హౌస్‌మేట్స్‌కి బిగ్ బాస్ ఇవ్వ‌బోతున్న షాకేంటో తెలుసా?  ముగ్గురిలో ఇద్ద‌రిని ఎలిమినేట్ చేయ‌డం శ‌నివారం ఒక‌రు ఎలిమినేట్ అయితే.. ఆదివారం మ‌రొక‌రు ఎలిమినేట్ కాబోతున్నారు.

ముగ్గురిలో ఇద్ద‌రినీ ఎలిమినేట్ చేయ‌బోతున్న విష‌యాన్నిహోస్ట్ నాగార్జున ప్ర‌క‌టించ‌డాన్ని ప్రోమోలో చూడొచ్చు. అయితే ప్రోమో చూస్తే ఓ విష‌యం అవ‌గాహ‌న‌కు వ‌స్తుంది. అదేంటంటే రాహుల్ ఎలిమినేట్ అయ్యాడ‌ని... ఎందుకంటే పున‌ర్న‌వి ఏడుస్తూ నా బెస్ట్ ఫ్రెండ్ సార్‌.. ఇప్పుడు నేను ఎవ‌రిని తిట్టాలి అంటుంది. అలా అంటే రాహుల్ ఎలిమినేట్ అయ్యాడ‌నుకోవ‌చ్చు. అలాగే హిమ‌జ కూడా ఎలిమినేష‌న్ అయ్యింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి.

టీమ్ లీడ‌ర్ కావ‌డం వ‌ల్ల మ‌హేశ్ ఎలిమినేష‌న్ నుండి త‌ప్పించుకున్నట్లు కూడా స‌మాచారం. ఇటీవ‌ల బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఓ వారం ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌ను త‌ప్పించుకున్న బిగ్‌బాస్ హౌస్ మేట్స్ లెక్క‌ను.. ఈవారం ఇద్ద‌రినీ ఎలిమినేట్ చేయ‌డం ద్వారా బిగ్‌బాస్ స‌రిచేయ‌బోతున్నాడేమో. మ‌రి ఎవ‌రైనా వైల్డ్‌కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తారో ఏమో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Get Breaking News Alerts From IndiaGlitz