close
Choose your channels

‘రాధేశ్యామ్‌’ సాంగ్ చిత్రీక‌ర‌ణ లీక్‌...!

Friday, January 15, 2021 • తెలుగు Comments

‘రాధేశ్యామ్‌’ సాంగ్ చిత్రీక‌ర‌ణ లీక్‌...!

రెబల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుద‌ల‌వుతుందా? అని అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. చిన్నా చిత‌కా అప్‌డేట్స్ మిన‌హా ఈ సినిమాకు సంబంధించి మేజ‌ర్ అప్‌డేట్ లేద‌ని అభిమానులు బాధ‌ప‌డుతున్నారు. సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ టీజర్ విడుదలవుతుందని అభిమానులు ఆతృత‌గా ఎదురుచూసినా, ఫ‌లితం లేకుండా పోయింది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ అన్న‌పూర్ణ స్టూడియోలో సాంగ్‌ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. సెట్స్ నుండి ఎవ‌రో ఒక‌రు ర‌హ‌స్యంగా ఓ పాట‌ను చిత్రీక‌రించి ఓ చిన్న డాన్స్ బిట్‌ను లీక్ చేశారు. ఈ లీకేజ్ సాంగ్ నెట్టింట వైర‌ల్ అవుతుంది. మరి ఇలాంటివి కొనసాగకుండా చిత్ర యూనిట్ ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటే బావుంటుంది.

ప్రభాస్ ‘రాధేశ్యామ్’ విడుద‌ల ముందు జూన్‌లో ఉండే అవ‌కాశాలున్నాయ‌ని అన్నారు. ఇప్పుడు సినిమా విడుద‌ల ఇంకాస్త ముందుకు వ‌చ్చింది.మార్చి 30న రాధేశ్యామ్‌ను తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుందనగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమా కోసం నాలుగు నెలల పాటు సమయాన్ని ప్రభాస్ కేటాయించాడట.

Get Breaking News Alerts From IndiaGlitz