close
Choose your channels

‘తాగిన మత్తులో..’ అంటూ శ్రియ ఫోటో షేర్ చేసిన నిర్మాత

Thursday, July 9, 2020 • తెలుగు Comments

‘తాగిన మత్తులో..’ అంటూ శ్రియ ఫోటో షేర్ చేసిన నిర్మాత

రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త ఆండ్రీ కొస్చీవ్‌ను పెళ్లి చేసుకుని ప్రశాంతంగా జీవిస్తున్న హీరోయిన్ శ్రియ సంసారంలో నిప్పులు పోసేలా ఉంది ఓ బాలీవుడ్ నిర్మాత పని. ఆయన షేర్ చేసిన ఫోటోతో పాటు.. క్యాప్షన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ నిర్మాత తనూజ్ గార్గ్ తన ఇన్‌స్టాగ్రాం స్టోరీస్‌లో ఒక ఫోటోను షేర్ చేశారు. దానికి ‘తాగిన మత్తులో అప్పటి రాత్రులు’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

శ్రీయ భుజంపై చేయి వేసి నడుస్తూ వెళుతున్నట్టుగా ఉందా ఫోటో. అది లండన్‌లో తీసిందని తనూజ్ గార్గ్ పేర్కొన్నారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిఫై ఫన్నీ ఫన్నీ మీమ్స్, జోక్స్ వెల్లువెత్తుతున్నాయి. దీనిపై శ్రియ ఎలా స్పందిస్తుందో.. ఆమె భర్త ఆండ్రీ ఎలా స్పందిస్తారనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.

Get Breaking News Alerts From IndiaGlitz