close
Choose your channels

ఆ బాలీవుడ్ హీరోకి టాలీవుడ్ నిర్మాత భారీ రెమ్యున‌రేష‌న్‌

Saturday, September 21, 2019 • తెలుగు Comments

ఆ బాలీవుడ్ హీరోకి టాలీవుడ్ నిర్మాత భారీ రెమ్యున‌రేష‌న్‌

ప్ర‌స్తుతం ద‌క్షిణాది, బాలీవుడ్ సినిమాల మ‌ధ్య అంత‌రాలు త‌గ్గిపోతున్నాయి. బాలీవుడ్ స్టార్స్ మ‌న ద‌క్షిణాది సినిమాల్లో న‌టించడానికి ఆస‌క్తిని క‌న‌పరుస్తున్నారు. ఆ క్ర‌మంలో బాలీవుడ్ స్టార్స్ అయిన అజ‌య్ దేవ‌గ‌ణ్‌.. ఆలియా భ‌ట్ టాలీవుడ్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ `RRR` చిత్రంలో న‌టిస్తున్నారు. సినీ వ‌ర్గాల స‌మాచారం మేర వీరి పాత్ర‌లు ప‌రిమితంగానే ఉన్నా.. భారీ మొత్తంలో రెమ్యునరేష‌న్స్ అందుకున్నార‌ట‌. అందులో అజ‌య్ దేవ‌గ‌ణ్ విష‌యానికి వ‌స్తే `RRR`లో ఈయ‌న ఎక్స్‌టెండెడ్ కేమియో పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నారు. పాత్ర చిన్న‌దా? పెద్ద‌దా? అని తేడా లేకుండా మ‌న నిర్మాత‌లు అజ‌య్ దేవ‌గ‌ణ్ అడిగినంత ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డ్డార‌ని టాక్‌. విన‌ప‌డుతున్న స‌మాచారం మేర అజ‌య్ దేవ‌గ‌ణ్‌కు నిర్మాత‌లు రూ.30కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇస్తున్నార‌ట‌.

ఇటీవ‌ల బల్గేరియాలో షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ఇప్పుడు త‌దుప‌రి షెడ్యూల్‌ను చ‌ర‌ణ్‌పై రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. కోలీవుడు న‌టుడు, ద‌ర్శ‌కుడు స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ధారిగా న‌టిస్తుండ‌గా.. రామ‌రాజు జోడి సీత పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ న‌టిస్తుంది. ఎన్టీఆర్ స‌ర‌స‌న హీరోయిన్‌గా ఎమ్మారాబ‌ర్ట్స్ న‌టిస్తుంద‌ని స‌మాచారం. ఇద్ద‌రు విప్ల‌వ నాయ‌కుల‌కు సంబంధించిన క‌ల్పిత‌గాథే ఈ చిత్రం. `బాహుబ‌లి` త‌ర్వాత రాజ‌మౌళి డైరెక్ట్ చేస్తోన్న చిత్రం కావ‌డంతో అంద‌రిలో సినిమా గురించి ఆస‌క్తి నెల‌కొంది. వ‌చ్చే ఏడాదిజూలై 30న సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు.

Get Breaking News Alerts From IndiaGlitz