close
Choose your channels

Bigg Boss Telugu 7 : టాస్క్‌ల్లో తేలిపోయిన శివాజీ.. టికెట్ టు ఫినాలే కష్టమేనా, ప్రియాంకను నలిపేసిన అమర్‌

Wednesday, November 29, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బిగ్‌బాస్ 7 తెలుగులో సోమవారం నామినేషన్స్ పర్వం ముగిసింది. కంటెస్టెంట్స్‌ల మధ్య గొడవలతో హౌస్ హీటెక్కిపోయింది. అందరూ దాదాపుగా శివాజీని టార్గెట్ చేసి నామినేట్ చేశారు. అయితే అర్జున్ , గౌతమ్‌లు తనను నామినేట్ చేయడాన్ని శివాజీ జీర్ణించుకోలేకపోయాడు. అర్జున్ ఇంత వంకరగా ఆలోచిస్తాడని తాను అనుకోలేదంటూ ప్రశాంత్‌తో అన్నాడు. వీళ్లేంటో నాకు అర్ధం కావడం లేదు.. జనాలు.. నన్ను పంపించేయండయ్యా అంటూ కామెంట్ చేశాడు.

తర్వాత 13వ వారం వచ్చేయడం.. గ్రాండ్ ఫినాలేకు సమయం దగ్గరపడుతూ వుండటంతో ఎవరిని ఫైనల్‌కు పంపాలనే దానిపై బిగ్‌బాస్ కసరత్తు షురూ చేశాడు. అదే ‘‘టికెట్ టూ ఫినాలే’’. దీనిలో భాగంగా కొన్ని గేమ్స్ పెడతానని, వీటిలో గెలిచి ఎక్కువ పాయింట్స్ సంపాదించిన హౌస్‌మేట్ నేరుగా ఫైనల్‌కు చేరుకుంటాడని చెప్పాడు. అనంతరం కంటెస్టెంట్స్‌కు ‘‘టిక్ టాక్ టిక్’’ అనే టాస్క్ ఇచ్చాడు. దీని ప్రకారం గార్డెన్ ఏరియాలో గడియారం లాంటి ఆకారం వుంటుంది.. దాని చుట్టూ చిన్న చిన్న బాక్సులు వుంటాయి. ఇంటి సభ్యులు ఆ బాక్స్‌లపై నిలబడి గడియారం ముల్లు తమవైపు వచ్చిన ప్రతీసారి.. దానిని తప్పించుకోవాలి. కానీ కింద పడకుండా, ముల్లు తమను తాకకుండా దాటాల్సి వుంటుంది. బాణం టచ్ అయితే ఔట్ అయినట్లు కాదని, ఆ బాక్స్‌పై నుంచి కింద పడితే ఔట్ అయినట్లు అని చెప్పాడు.

గేమ్ స్టార్ట్ అయ్యాక.. ముల్లును దాటే క్రమంలో పట్టు కోల్పోయిన పల్లవి ప్రశాంత్ పక్కనే వున్న అర్జున్ బాక్స్‌పై కాలు పెట్టడంతో రైతుబిడ్డ ఔట్ అయినట్లు ప్రకటించారు బిగ్‌బాస్. తర్వాత గౌతమ్, శోభా శెట్టి, శివాజీ, అమర్‌దీప్‌లు కూడా ఎలిమినేట్ అయ్యారు. ఈ టాస్క్‌లో చివరి వరకు నిలిచిన అర్జున్ విజేతగా నిలిచాడు. అనంతరం ‘‘పూలనే సేకరించాలట’’ అని మరో టాస్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీనిలో భాగంగా యాక్టివిటీ ఏరియాలో వున్న పువ్వులను తీసుకొచ్చి గార్డెన్ ఏరియాలో కంటెస్టెంట్స్ పేర్లతో ఏర్పాటు చేసిన ట్రేలలో వేయాలి. ఈ గేమ్‌లో అందరికంటే తక్కువ పూలు సేకరించిన శివాజీ , శోభాలు ఎలిమినేట్ అయిపోయారు. అయితే వారు సేకరించిన పూలను మరొకరికి ఇవ్వొచ్చని బిగ్‌బాస్ చెప్పాడు.

ఆ మాట చెప్పగానే అమర్‌దీప్ వచ్చి అన్నా టికెట్ టు ఫినాలే ఇస్తానంటూ మాట ఇచ్చావంటూ గుర్తుచేశాడు. అందుకే నీ పూలని నాకే ఇవ్వాలంటూ మారాం చేశాడు. నీకు శోభా ఇస్తుందిలే అని చెప్పగా.. కాదు నువ్వే ఇవ్వు అంటూ నస పెట్టాడు. ఇంతలో బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. శోభా, శివాజీ ఇద్దరూ కలిసి వారి పాయింట్స్‌ను కంటెస్టెంట్స్‌లో ఒకరికే ఇవ్వాలని ఆదేశించడంతో వారిద్దరూ అమర్‌కే ఆ పూలను ఇచ్చారు. తర్వాత ‘‘గాలం వేయ్ బుట్టలో పడేయ్’’ అని టాస్క్ ఇచ్చారు బిగ్‌బాస్. దీనికి శివాజీ, శోభా సంచాలకులుగా వ్యవహరించారు. గేమ్ ప్రకారం సర్కిల్‌ మధ్యలో వున్న బాల్‌ను దాని చుట్టూ నిలబడిన కంటెస్టెంట్స్ గాలం వేసి పట్టుకోవాలి. బాల్ బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే దానిని లాక్కొని తమ బాస్కెట్‌లో వేసుకోవచ్చు.

గేమ్ మొదలయ్యాక అర్జున్ బాల్‌ను తన బుట్టలో వేసుకుని టాప్ స్కోర్‌ను సాధించాడు. తర్వాత ప్రశాంత్, యావర్, అమర్‌లు .. ప్రియాంకతో పోటీ పడ్డారు. చివరిలో ప్రియాంక, అమర్‌దీప్ మాత్రమే పోటీలో వుండటంతో వీరిద్దరూ మధ్య పోరు హోరాహోరీగా జరిగింది. బాల్ కోసం ప్రియాంకతో అమర్ గట్టిగా ఫైట్ చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ప్రియాంకకు గట్టిగానే దెబ్బలు తగిలినట్లుగా కనిపిస్తోంది. గేమ్ ముగిసిన తర్వాత అమర్ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ప్రియాంక ఏడ్చేసింది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.