ఆంగ్ల భోధనకు ప్రాధాన్యం: మంత్రి వాసంశెట్టి సుభాష్


Send us your feedback to audioarticles@vaarta.com


కూటమి ప్రభుత్వంలో విద్యారంగంలో ఏది మంచిదో దాన్నే అమలు చేస్తామని అన్నారు ఏపీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం విద్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. బుధవారం కృష్ణాజిల్లా పెనమలూరు లో ఆర్ వి ఎస్ అను విద్యానికేతన్లో ఆంగ్ల ఉన్నత పాఠశాలను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి పాఠశాలకు గ్రామాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సూచించారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. అలాగే ఆంగ్ల బోధన కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు.
కాబట్టి మాతృభాషతో పాటు ఆంగ్ల విద్యను కూడా అభ్యసిస్తే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చన్నారు. అందుకే విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని, పాఠాలు బాగా నేర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఆర్టీసీ చైర్మన్, రాష్ట్ర బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com