close
Choose your channels

పవన్.. ఏం మాట్లాడుతున్నావ్.. ఒప్పుకోకపోవడమేంటి?: పృథ్వీ

Thursday, December 5, 2019 • తెలుగు Comments

పవన్.. ఏం మాట్లాడుతున్నావ్.. ఒప్పుకోకపోవడమేంటి?: పృథ్వీ

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం.. అది కూడా రెండు చోట్ల పోటీ చేసినా ఒక్కచోట కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలవని విషయం విదితమే. అయితే ఈ ప్రభావం గట్టిగా పడటంతో రానున్న ఎన్నికల్లో అయినా కాస్త గట్టిగా పోటీ ఇవ్వాలని.. అంతకంటే ముందుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపించాలని పవన్.. జిల్లాల బాట పట్టారు. అయితే ఈ పర్యనటల్లో భాగంగా గతంలో అధికారంలో ఉన్న టీడీపీని.. కేంద్రంలో ఉన్న బీజేపీని పొల్లెత్తు మాట అనని పవన్.. అధికారపార్టీ వైసీపీపై.. సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. అయితే పవన్ వ్యాఖ్యలకు మరోవైపు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.. మహిళా మంత్రులు మేకతోటి సుచరిత, పుష్ప శ్రీవాణితో పాటు పలువురు స్పందించి స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. అయితే తాజాగా పవన్ వ్యాఖ్యలపై థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ మాట్లాడారు.

పవన్ అలా అనడం సరికాదు..!

‘జగన్‌ను ముఖ్యమంత్రిగా ఒప్పుకోనని పవన్ కల్యాణ్ అనడం సరికాదు. ఏపీలో 150కి పైగా సీట్లు ఇచ్చి, జగన్‌ను ప్రజలు సీఎంను చేశారు. ఇంత మెజారిటీతో జగన్ సీఎం అయ్యారు. ఆయనను సీఎంగా పవన్‌ ఒప్పుకోకపోవడం ఏమిటి..?. పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఏ హిందూ దేవాలయంలోనూ అన్యమత ప్రచారం జరగడంలేదు. జగన్ ప్రభుత్వంపై బురద చల్లాలనే ఉద్దేశంతోనే కొందరు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజకీయాల విషయంలో సైద్ధాంతికంగా ఎదుర్కోవాలని, ఇలా వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దు’ అని జనసేనానికి పవన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

Get Breaking News Alerts From IndiaGlitz