close
Choose your channels

నీ బిల్డప్ ఏందయ్యా .. వేదవ సోది, ముందు కొవ్వు కరిగించు : కేశినేని నానికి పీవీపీ స్ట్రాంగ్ కౌంటర్

Thursday, June 1, 2023 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

నీ బిల్డప్ ఏందయ్యా ..  వేదవ సోది, ముందు కొవ్వు కరిగించు  : కేశినేని నానికి పీవీపీ స్ట్రాంగ్ కౌంటర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, విభజిత ఏపీ అయినా బెజవాడ రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్‌గానే వుంటాయి. పొలిటికల్‌గా అత్యంత చైతన్యంగా వుండటం, ఏపీని శాసించే రెండు ప్రధాన సామాజిక వర్గాలకు, వర్తక, వాణిజ్యాలకు కేంద్రం విజయవాడ నగరం. అందుకే తొలి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఈ సిటీది కీలకపాత్ర . ఎన్నికల్లో విజయవాడ నుంచి పోటీ చేయడానికి అన్ని పార్టీల్లోనూ ఆశావహుల సంఖ్య భారీగానే వుంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇక్కడి ఎంపీ స్థానం గురించి. ఏ పార్టీ అభ్యర్ధి గెలిచినా అతను ఖచ్చితంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే అయ్యుంటాడు. ప్రస్తుతం ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి కేశినేని నాని ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచి ఈసారి హ్యాట్రిక్ పైన కన్నేశారు నాని.

ఏ పిట్టల దొరకు సీటిచ్చినా ఇబ్బంది లేదన్న నాని :

కానీ ఈసారి టీడీపీ హైకమాండ్ కేశినేని నానికి కాకుండా అతని సోదరుడు చిన్నికి టికెట్ ఇవ్వాలని భావిస్తోంది. దీంతో గత కొంతకాలంగా నాని అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఈ క్రమంలోనే నిన్న నాని హాట్ కామెంట్స్ చేశారు. తనకు టికెట్ ఇవ్వకపోతే.. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని.. ఏ పిట్టల దొరకు సీటిచ్చినా ఇబ్బంది లేదని ఆయన వ్యాఖ్యానించారు. తన మనస్తత్వానికి సరిపోతే ఏ పార్టీ అయినా ఓకే అని కేశినేని స్పష్టం చేశారు. తాను చేసినంత అభివృద్ధి దేశంలో ఏ ఎంపీ చేయలేదంటూ కేశినేని అన్నారు.

కొవ్వు కరిగించే పనిలో వుండు : పీవీపీ

అయితే అభివృద్ధిపై నాని చేసిన వ్యాఖ్యలకు గాను ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రసావ్ వీ పొట్లూరి ఘాటుగా స్పందించారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేసిన ఆయన.. 'నీ బిల్డప్ ఏందయ్యా కేశినేని నాని.. నువ్వేదో అల్లూరికి ఎక్కువ, నేతాజీకి తక్కువ అన్నట్టు.. ప్రజాసేవ కోసం పుట్టానంటావు.. కానీ, దొబ్బెది బ్యాంకులని, జీతాలు ఎగదొబ్బేది కార్మికులకు.. వెరసి మన బెజవాడోళ్ళందరికి చేతిలో చిప్ప.. నోటిలో మట్టి.. వేదవ సోది ఆపి కాస్త కొవ్వు కరిగించే పనిలో ఉండు.. తర్వాత ఎన్నికల బరిలో దొర్లుకుంటూ వద్దువు' అంటూ ప్రసాద్ విమర్శలు కురిపించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2019లో ఓటమి పాలైన పీవీపీ :

2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ ఎంపీ అభ్యర్ధిగా ప్రసాద్ వీ పొట్లూరి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి కేశినేని నాని చేతిలో ఓడిపోయారు. నాటి నుంచి పొట్లూరి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా వుంటూ తన వ్యాపారాలు చూసుకుంటున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనుండటంతో ప్రసాద్.. మరోసారి యాక్టీవ్ అయ్యారా అన్న చర్చ నడుస్తోంది. మొత్తం మీద చాలా రోజుల తర్వాత పొట్లూరి రంగప్రవేశం బెజవాడ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.