close
Choose your channels

ప్ర‌భాస్ మేక‌ప్ మ్యాన్‌కి క‌రోనా

Wednesday, April 21, 2021 • తెలుగు Comments

ప్ర‌భాస్ మేక‌ప్ మ్యాన్‌కి క‌రోనా

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌, డార్లింగ్స్‌కి బ్యాడ్ న్యూస్‌. యంగ్ రెబ‌ల్ స్టార్ ప‌ర్స‌న‌ల్ మేక‌ప్ మ్యాన్‌కి కొవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దాంతో హైద‌రాబాద్‌లో జ‌రుగుతున్న‌ `రాధే శ్యామ్` షూటింగ్ ఆగింది. హీరోకి క‌రోనా ల‌క్ష‌ణాలు లేవ‌ని ప్రాధ‌మిక స‌మాచారం. అత‌డికి అత్యంత స‌న్నిహితంగా మెలిగే మేక‌ప్‌మ్యాన్ క‌రోనా బారిన ప‌డ‌టంతో ప్ర‌భాస్ హోమ్ ఐసోలేష‌న్‌లో వున్నార్ట‌. ఆయ‌న హెల్త్ అప్‌డేట్ తెలియాల్సి వుంది.

`రాధే శ్యామ్` షూటింగ్ చెయ్య‌డానికి హీరోయిన్ పూజా హెగ్డే నిరాక‌రించింద‌ని గుస‌గుస‌లు విన్పించాయి. హైద‌రాబాద్‌లో లేటెస్ట్‌ షెడ్యూల్ క్యాన్సిల్ కావ‌డానికి రీజ‌న్ అదేన‌ని భావించారంతా. ఆఖ‌రికి ప్ర‌భాస్ మేక‌ప్ మ్యాన్‌కి క‌రోనా అని తెలిసేవ‌ర‌కూ పూజా హెగ్డే నింద మోయాల్సి వ‌చ్చంది.

క‌రోనా సెకండ్ వేవ్ ధాటికి టాలీవుడ్‌లో భారీ స్టార్ కాస్ట్ సినిమా షూటింగ్స్ పోస్ట్‌పోన్ అవుతున్నాయి. యూనిట్‌లో కోర్ టీమ్ మెంబ‌ర్స్ కొవిడ్ బారిన పడుతుంటంతో షెడ్యూల్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. నైట్ క‌ర్ఫ్యూ రూల్స్‌ వ‌ల్ల షూటింగ్ చెయ్య‌లేక మిగ‌తా యూనిట్స్ షూటింగ్స్‌ని పోస్ట్‌పోన్ చేస్తున్నాయి.

Get Breaking News Alerts From IndiaGlitz