close
Choose your channels

మోదీ బ‌యోపిక్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన ప్ర‌భాస్‌

Tuesday, September 17, 2019 • తెలుగు Comments

మోదీ బ‌యోపిక్‌.. ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన ప్ర‌భాస్‌

ప్ర‌స్తుతం బ‌యోపిక్స్ ట్రెండ్ బాగా న‌డుస్తోంది. ప‌లు రంగాల్లోని కీల‌క వ్య‌క్తుల జీవిత చ‌రిత్ర‌ల‌ను వెండితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. ఆ కోవ‌లో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ బ‌యోపిక్ తెర‌కెక్క‌నుంది. అదేంటి ఈయ‌న బ‌యోపిక్ ఎప్పుడో రూపొదింది క‌దా! అనే సందేహం రావ‌చ్చు. పి.ఎం. న‌రేంద్ర మోదీ పేరుతో వివేక్ ఒబెరాయ్ ఇప్ప‌టికే మోదీ జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా రూపొందించారు. ఇప్పుడు మ‌రో బ‌యోపిక్ రూపొంద‌నుంది. మ‌న్ బైరాగి పేరుతో సంజ‌య్ లీలా భ‌న్సాలి, మ‌హావీర్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. సంజ‌య్ త్రిపాఠి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

ఈరోజు(సెప్టెంబ‌ర్ 17) న‌రేంద్ర మోదీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ విడుద‌ల చేశారు. ప్ర‌భాస్ త‌న ఫేస్ బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ లుక్‌ను విడుద‌ల చేస్తూ న‌రేంద్ర‌మోదీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అలాగే చిత్ర యూనిట్‌ను అభినంద‌న‌లు తెలిపారు. ఈ చిత్రాన్ని తెలుగులో మ‌నో వైరాగి పేరుతో విడుద‌ల చేస్తున్నారు. ప్ర‌భాస్ తెలుగు, హిందీ పోస్ట‌ర్స్ ను మాత్ర‌మే షేర్ చేశారు. ప్ర‌తి ఒక ప్రయాణం ముందు అంత‌రంగంగానే ప్రారంభం అవుతుంది అంటూ ఈ సినిమా ట్యాగ్‌లైన్‌గా పెట్టారు. న‌రేంద్ర మోదీ గురించి ఎవ‌రికీ తెలియ‌ని విష‌యాల‌ను ఈ సినిమాలో తెర‌కెక్కిస్తార‌ని స‌మాచారం.

2019 ఎన్నిల‌క స‌మ‌యంలో న‌టుడు వివేక్ ఒబెరాయ్ కూడా `పి.ఎం  న‌రేంద్ర మోదీ పేరుతో బ‌యోపిక్ రూపొందించారు. అప్ప‌ట్లో ఈ బ‌యోపిక్‌పై చాలా వివాదాలే న‌డిచాయి. ఎట్ట‌కేల‌కు కోర్టు అనుమ‌తితో ఎన్నిక‌లు త‌ర్వాత సినిమా విడుద‌లైన‌ప్ప‌టికీ పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. 

Get Breaking News Alerts From IndiaGlitz