close
Choose your channels

బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు ప్రభాస్.. ఫ్యాన్స్‌కి పండగే!

Friday, December 2, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు ప్రభాస్.. నిజమైతే ఫ్యాన్స్‌కి పండగే, డార్లింగ్ ఒప్పుకుంటాడా..?

నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’లో ప్రసారమైన ‘అన్‌స్టాపబుల్’ సీజన్ వన్ ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్య ఇంటర్వ్యూ చేసే విధానం, ఆయన అల్లరి, గెస్ట్‌లతో వ్యవహరించే తీరు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఈ ఒక్క షోతోనే ఆహా‌కు లక్షలాది మంది కొత్త సబ్‌స్క్రైబర్లు యాడ్ అయ్యారు. దీంతో అన్‌స్టాపబుల్ సీజన్‌ 2కి ప్లాన్ చేశారు నిర్వాహకులు. తొలి ఎపిసోడ్‌కు టీడీపీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేశ్‌లు హాజరయ్యారు. తర్వాత విశ్వక్‌‌సేన్, సిద్ధూ జొన్నలగడ్డ.. శర్వానంద్- అడవి శేష్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి- కేఆర్ సురేష్ రెడ్డి- రాధికలు మిగిలిన ఎపిసోడ్‌లకు హాజరయ్యారు.

అన్‌స్టాపబుల్ 2కి గెస్ట్‌ల కొరత:

ప్రస్తుతం సీనియర్, జూనియర్ హీరోలంతా షూటింగ్‌లతో బిజీగా వుండటంతో ‘‘అన్‌స్టాపబుల్ 2’’కి గెస్ట్‌ల కొరత ఏర్పడినట్లుగా తెలుస్తోంది. సెకండ్ సీజన్‌లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి వంటి వారిని గెస్ట్‌లుగా తీసుకొచ్చింది ఆహా టీమ్. అయితే రాజకీయాలను రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వారికి తప్పించి.. ఎంటర్‌టైన్మెంట్ లవర్స్‌కి మాత్రం వారి రాక ఏమాత్రం కిక్ ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య అన్‌స్టాపబుల్ షోకు ప్రభాస్.. నిజమైతే ఫ్యాన్స్‌కి పండగే, డార్లింగ్ ఒప్పుకుంటాడా..?

ప్రభాస్‌ని బాలయ్య డీల్ చేయగలరా:

అయితే అన్‌స్టాపబుల్‌కి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాన్ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ని ఈ షోకు తీసుకురావాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్ ‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇంటర్వ్యూల్లో , వేదికలపై మాట్లాడేందుకు సిగ్గు మొగ్గలేసే ప్రభాస్‌.. బాలయ్య జోష్‌ని తట్టుకోగలడా అనే ప్రశ్నలను నెటిజన్లు లేవనెత్తుతున్నారు. అయితే అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్, శర్శానంద్ లాంటి కుర్రహీరోలను బాలయ్య డీల్ చేసిన తీరు గుర్తొచ్చి .. ప్రభాస్‌నైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా బాలకృష్ణ ఈజీగా ఇంటర్వ్యూ చేసేస్తాడని అంటున్నారు. అంతా బాగానే వుంది కానీ.. ఇంతకీ ప్రభాస్‌ అన్‌స్టాపబుల్‌కి వస్తాడా లేక ఇది గాలివార్తా అన్నది తెలియాల్సి వుంది.

చేతినిండా ప్రాజెక్ట్‌లతో డార్లింగ్:

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభాస్ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కే చేస్తున్నారు. వీటన్నింటిపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి . ఇవి కాకుండా మారుతి దర్శకత్వంలోనూ ప్రభాస్ ఓ సినిమా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.