close
Choose your channels

కాంగ్రెస్‌కు కోలుకోలేని షాక్.. ఎంపీలో కూలనున్న సర్కార్!

Tuesday, March 10, 2020 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కొన్ని దశాబ్ధాలుగా ఇండియాను ఏలిన కాంగ్రెస్‌కు 2014 తర్వాత అస్సలు కలిసి రావట్లేదు. గత పదేళ్ల నుంచి ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తోంది. అంతేకాదు.. అధికారంలో ఉన్న రాష్ట్రాలను సైతం ఒక్కొక్కటిగా కోల్పోతుండగా.. ఆయా రాష్ట్రాల్లో కమలం వికసిస్తోంది. ఇప్పటికే కర్ణాటక లాంటి రాష్ట్రాన్ని కోల్పోయిన కాంగ్రెస్.. తాజాగా మధ్యప్రదేశ్‌ను కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్పష్టం అవుతోంది. మధ్యప్రదేశ్ (ఎంపీ)లో అధికారంలో ఉన్న పార్టీని పడగొట్టడానికి బీజేపీ పెద్దలు చేసిన విశ్వప్రయత్నాలు సక్సెస్ అవుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

నాటి నుంచే..!
మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో క్రియాశీలకంగా.. కీలకనేతగా ఉన్నది.. యువనేతలు ఇద్దరే ఇద్దరు.. వారిలో ఒకరు సచిన్ ఫైలెట్ కాగా.. మరొకరు జ్యోతిరాదిత్య సింధియా. వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత వీరిద్దరిలో ఎవరో ఒకరు సీఎం పీఠాన్ని అధిరోహిస్తారని అందరూ భావించారు అయితే ఎవరూ ఊహించని రీతిలో కమలనాథన్‌ను సీఎం చేయడం యువనేతలు.. పార్టీకోసం అహర్నిశలు కష్టపడిన వారికి మింగునపడలేదు. దీంతో నాటి నుంచి పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూనే వస్తున్నారు. తీరా చూస్తే.. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ నుంచి జారుకోవడం.. అసంతృప్తితో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం జరుగుతూ వస్తోంది.

రాజీనామా వెనుక..!
సోమవారం నాడు ఏకంగా జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా చేసేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి పంపించారు. అనంతరం సోషల్ మీడియాలోనూ షేర్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాతో భేటీ అయిన కొద్దిసేపటికే ఆయన రాజీనామా చేయడం గమనార్హం. అంతేకాదు కేంద్ర హోం మంత్రి షానే దగ్గరుండి మరీ మోదీ దగ్గరికి తీసుకెళ్లడం మరింత చర్చనీయాంశమైంది. ‘గత 18 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పని చేశాను. ఇప్పుడు మరో దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నాను. నేను ఈ దిశగా ఏడాది క్రితం నుంచే ఆలోచిస్తున్నాననే విషయం మీకు తెలుసు. రాష్ట్ర ప్రజలకు, దేశానికి సేవ చేయాలనే లక్ష్యం నాకు ముందు నుంచి ఉంది. అయితే, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నా లక్ష్యాన్ని నేను సాధించలేను’ అందుకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో సింథియా పేర్కొన్నారు.

ఒకరు కాదు మొత్తం 20 మంది!
మొత్తానికి చూస్తే ఆయన బీజేపీలో చేరిక పక్కా అయిపోయింది. అంతేకాదు అన్నీ అనుకున్నట్లు జరిగితే కాసేపట్లో సింధియా బీజేపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా.. సింధియా వెనుక దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సింథియా బీజేపీలో చేరితో ఆ ఎమ్మెల్యేలంతా కాషాయ కండువా కప్పేసుకుంటారు. ఇదే జరిగితే ఎంపీలో కాంగ్రెస్ పీఠం కదిలినట్లే.. హస్తం ప్రభుత్వం పోయి కమలం ప్రభుత్వం వస్తుందన్న మాట. అంటే.. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటులో సింథియా పాత్ర కీలకం కానుంది. కాగా గత కొన్నిరోజులుగా ఎంపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్న విషయం విదితమే. అయితే సింథియా నిర్ణయంతో దాదాపు ఈ హైడ్రామాకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిమిషాల వ్యవధిలోనే..!
రాజీనామా అనంతరం సింధియాను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఆయన పాల్పడ్డారని కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. పార్టీ నుంచి సింధియా బహిష్కరణ తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. ఇదిలా ఉంటే మోదీని సింథియా కలిసొచ్చిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథన్ సర్కార్ కుప్పకూలబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.