close
Choose your channels

హైదరాబాద్ మరో అద్భుతం.. ఇక నేరగాళ్ల పని అంతే, అతి త్వరలో..

Monday, June 28, 2021 • తెలుగు Comments

హైదరాబాద్ లో మరో అద్భుత ఆవిష్కరణకు సమయం ఆసన్నమైంది. హైదరాబాద్ ఖ్యాతిని పెంచేలా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ట్విన్ టవర్స్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణం తుది దశకు చేరుకుంది. దాదాపు 450 కోట్లకు పైగా వ్యయంతో ఈ నిర్మాణం చేపడుతున్న సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: 8 జిల్లాల్లో ఏపీలో కర్ఫ్యూ సడలింపు.. కొత్త నిబంధనలు ఇవే!

కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అందుబాటులోకి రాగానే..ఒక లక్ష 12 వేల 77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న తెలంగాణలోని ప్రతి అంగుళం ఇక 360 డిగ్రీల కోణంలో పోలీస్‌ రాడార్‌ పరిధిలోకి వస్తుంది. దీనితో తెలంగాణ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా మారనుంది.

తెలంగాణలో ఏ మూల ఏం జరిగినా పోలీసులు పసిగట్టేలా ఈ వ్వవస్థ పనిచేయనుంది. దీనితో నేరాలని పూర్తిగా అదుపులోకి తీసుకురావచ్చు. మొదట కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణానికి 350 కోట్లు అవసరం అవుతుంది అని అంచనా వేశారు. ఆ తర్వాత దీని బడ్జెట్ 450 కోట్లకు చేరింది. తాజాగా మరో 200 కోట్లు అదనంగా ఖర్చయినట్లు తెలుస్తోంది.

ఏడు ఎకరాల్లో 7 లక్షల చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ఏ, బీ, సీ, డీ నాలుగు బ్లాకులుగా కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ టవర్లు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. హెలిప్యాడ్ సౌకర్యం కూడా ఉంటుంది. ఓపెన్‌ ఆఫీస్‌, మీటింగ్‌ రూమ్స్‌, కాన్ఫరెన్స్‌ రూం, క్యాబిన్లు ఉంటాయి. ముఖ్యమంత్రి, హోంమంత్రి, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ క్యాబిన్లు, మల్టీపర్పస్‌ హాల్‌, హెలీప్యాడ్‌ టవర్‌-ఏలోనే ఉంటాయి. టవర్‌ -బీని జీ ప్లస్‌ 15గా నిర్మించారు. ఇందులో ఓపెన్‌ ఆఫీస్‌, మీటింగ్‌ రూమ్స్‌, కాన్ఫరెన్స్‌ రూం, క్యాబిన్స్‌, డీజీపీ, సీఎస్‌ క్యాబిన్లు, డయల్‌-100 ఉంటాయి.

టవర్‌-డీలో మీడియా సమావేశం నిర్వహణతోపాటు క్యాంటీన్‌, శిక్షణా గదులు, మంత్రుల క్యాబిన్లు, వార్‌ రూం ఉంటాయి. టవర్లలో ఒకదాని నుంచి మరోదానికి చేరుకునేందుకు వీలుగా స్కైవేలు నిర్మించారు. కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను టెక్నాలజీ ఫ్యూజన్‌ సెంటర్‌గా రూపుదిద్దుతున్నాం. జిల్లాల్లోని కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్లతో ఈ సెంటర్‌ అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఇది నెట్‌వర్క్‌ ఆఫ్‌ కమాండ్‌ సెంటర్స్‌గా మారుతుంది. ప్రభుత్వ సహకారం, ప్రజలు, నాయకుల భాగస్వామ్యంతో రాష్ట్రంలో 8 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం అని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Get Breaking News Alerts From IndiaGlitz