LPG Cylinder Price: మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త.. వంట గ్యాస్ ధర తగ్గింపు...


Send us your feedback to audioarticles@vaarta.com


మహిళా దినోత్సవం సందర్భంగా దేశంలోని మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. వంటగ్యాస్ ధరను రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. "నేడు మహిళా దినోత్సవ సందర్భంగా మా ప్రభుత్వం ఎల్పీజీ సిలిండర్ ధరను 100 రూపాయలు తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గుతుంది. వంట గ్యాస్‌ను మరింత అందుబాటులోకి చేయడం ద్వారా పేద ప్రజల కుటుంబాల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడం. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని తీసుకొచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది మహిళలకు సాధికారత కల్పించేందుకు వారికి ఈజ్ ఆఫ్ లివింగ్ అందించడానికి మా ప్రభుత్వం నిబద్ధతకు అనుగుణంగా ఉంది" అంటూ తెలిపారు.
ఇప్పటికే గతేడాది రాఖీ పండుగ సందర్భంగా సిలిండర్ ధరను 200 రూపాయలు తగ్గించిన విషయం విధితమే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 955 ఉండగా.. ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 903.. ముంబైలో సిలిండర్ ధర రూ.902 ఉంది. కేంద్రం తాజా నిర్ణయంతో హైదరాబాద్‌లో రూ.100 తగ్గి రూ.855.. ఢిల్లీలో రూ.803.. ముంబైలో రూ.802 ఉండనుంది. మోదీ నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన ద్వారా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై ఇస్తున్న సబ్సిడీని కూడా మరో ఏడాది పాటు పొడిగించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఇందుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అందిస్తున్న 300 రూపాయల రాయితీని మార్చి 31, 2025 వరకు అందించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అర్హులైన గ్యాస్ వినియోగదారులకు ఆర్థిక భారం తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పేద ప్రజలకు ఉచితంగా సిలిండర్ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చింది. ఉజ్వల యోజన ద్వారా 10 కోట్ల మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక్కో సిలిండర్ పై రూ.300 మేర సబ్సిడీ అందిస్తున్న సంగతి తెలిసిందే.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments