close
Choose your channels

'పిహిల్వాన్' ట్రైల‌ర్ విడుద‌ల‌... సెప్టెంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్‌

Thursday, August 22, 2019 • తెలుగు Comments

`పిహిల్వాన్` ట్రైల‌ర్ విడుద‌ల‌... సెప్టెంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్‌

శాండిల్ వుడ్ బాద్షా..`ఈగ` ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `ప‌హిల్వాన్‌`. ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగులోనూ `ప‌హిల్వాన్‌` అనే పేరుతో సెప్టెంబ‌ర్ 12న‌ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన `ప‌హిల్వాన్` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. గురువారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.  ఈ ట్రైల‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది.

అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాకు క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. `కె.జి.య‌ఫ్‌` చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసి ఘ‌న విజ‌యాన్ని అందుకున్న వారాహి చ‌ల‌న చిత్రం ఇప్పుడు `ప‌హిల్వాన్‌` చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 12న  గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz