close
Choose your channels

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ వీడియో లీక్

Monday, February 3, 2020 • తెలుగు Comments

నేను న‌ల్ల‌కోటు వేసుకుంటే...మ‌రోసారి పింక్ రీమేక్ వీడియో లీక్‌

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఎక్క‌డా అధికారికంగా స‌మాచారం రాకున్న‌ప్ప‌టికీ అన‌ధికారికంగా పవ‌న్ ఇప్ప‌టికే రెండు సినిమాల‌ను ఓకే చేశారు. మ‌రో రెండు సినిమాల‌ను ట్రాక్ ఎక్కించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నారు. కాగా.. ప్ర‌స్తుతం `పింక్‌` రీమేక్ చిత్రీక‌ర‌ణ‌లో ప‌వ‌న్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సినిమాను లీకేజీల స‌మ‌స్య తెగ ఇబ్బంది పెడుతుంది. సినిమా ప్రారంభం రోజునే ప‌వ‌న్ లుక్ లీక్ అయ్యింది. కాగా.. ఇప్పుడు 20 సెక‌న్స్ వ్య‌వ‌థి ఉన్న వీడియోను లీకేజీ వీరులు విడుద‌ల చేశారు.

ఈ వీడియోలో నేను న‌ల్ల‌కోటు వేసుకుంటే వేయ‌డానికి పిటీష‌న్స్‌..తీసుకోవ‌డానికి బెయిల్స్ ఉండ‌వు` అని త‌న‌తో మాట్లాడుతున్న వ్య‌క్తితో ప‌వ‌న్ డైలాగ్ చెబుతున్నారు. స్పాట్‌లోని వ్య‌క్తులే ర‌హ‌స్యంగా ఈ వీడియో చిత్రీకరించి లీక్ చేశార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వేణుశ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, బోనీ క‌పూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది వేస‌వి సంద‌ర్భంగా మే 25న సినిమాను విడుదల చేస్తున్నామ‌ని నిర్మాత దిల్‌రాజు ప్ర‌క‌టించారు. దీని వెంట‌నే క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్..ఓ పీరియాడిక‌ల్ మూవీలో రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో న‌టించ‌బోతున్నారు. ఈసినిమా కూడా లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది.

Get Breaking News Alerts From IndiaGlitz