close
Choose your channels

జగన్.. మీరూ పెళ్లి చేస్కోండి..: పవన్

Tuesday, November 12, 2019 • తెలుగు Comments

జగన్.. మీరూ  పెళ్లి చేస్కోండి..: పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పెళ్లిళ్లు, పిల్లలపై ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. స్ట్రాంగ్ కౌంటరిచ్చారు.

మంగళవారం నాడు ఏపీ గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘ప్రతిదానికి నన్ను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడంటూ విమర్శిస్తున్నారు. నేనేమీ సరదా కోసం మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు.. కుదర్లేదు కాబట్టే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాను. అయినా నేను ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంటే మీకెందుకు బాధ? కావాలంటే మీరూ చేసుకోండి..?. సామరస్య పూర్వక పద్ధతిలో సమస్యలు పరిష్కారించాలన్నది మా పార్టీ అభిమతం. అందరూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే సమస్య మరుగున పడిపోతుంది.. సద్విమర్శలు చేయడం మా పార్టీ సంస్కృతి. కానీ వైసీపీ సంస్కృతి వ్యక్తిగత విమర్శలతో మీద పడిపోవడమే. మీరు వ్యాఖ్యలు చేస్తే టీడీపీ వాళ్లు పడతారేమో కానీ, జనసేన నేతలు పడరు. అబ్దుల్ కలాం పేరిట జరిగిన కార్యక్రమంలో మాట్లాడాల్సిన మాటలేనా అవి?. 151 ఎమ్మెల్యేలున్న ఓ పార్టీ ఒక్క ఎమ్మెల్యే ఉన్న మరో పార్టీపై ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేయాల్సిన పనిలేదు.. కానీ అలా చేస్తున్నారంటే జనసేన అంటే వైసీపీ భయపడుతున్నట్టే లెక్క ’ అని పవన్ జోస్యం చెప్పారు. అయితే పవన్ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే మరి.

Get Breaking News Alerts From IndiaGlitz