Pawan Kalyan Sai Tej:సస్పెన్స్‌కు చెక్ : పవన్ - సాయితేజ్ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్‌కి ముహూర్తం ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో ఆయన బిజీగా వుంటున్నారు. వచ్చే ఏపీ ఎన్నికలు ఆయన పొలిటికల్ కెరీర్‌కు అత్యంత కీలకమైనవి కావడంతో పవన్ తన చేతిలో వున్న సినిమాలు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో వుండాలని భావిస్తున్నారు. దీంతో పాటు మరికొద్దినెలల్లో ఏపీలో ఎన్నికల సందడి మొదలుకానుండటంతో అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం, వ్యూహాలతో పవన్ తలమునకలు కానున్నారు.
మేనల్లుడితో తొలిసారి పవన్ :
ప్రస్తుతం పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు వున్నాయి. వీటితో పాటు తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి మల్టీస్టారర్ చేస్తున్నారు. విలక్షణ నటుడు, దర్శకుడు సముద్రఖని ఈ సినిమాకు దర్శకుడు. తమిళ హిట్ మూవీ ‘‘వినోదయ సీతం’’కు ఇది తెలుగు రీమేక్. దీనిని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జూలై 28న ‘బ్రో’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో సాయితేజ్ సరసన కేతికా శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి ‘బ్రో’, ‘‘దేవర’’ అనే టైటిల్స్ ప్రచారంలో వున్నప్పటికీ.. దేనిని ఫిక్స్ చేయలేదు. అయితే ఈ సస్పెన్స్‌కు తెరదించుతూ పవన్-సాయితేజ్ మూవీ ఫస్ట్ లుక్, టైటిల్‌లను అనౌన్స్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. టైమ్ వచ్చేసింది అంటూ మూవీ యూనిట్ ఓ పోస్టర్ విడుదల చేసింది. రేపు (మే 18, గురువారం) సాయంత్రం 4.14 గంటలకు పోస్టర్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని తెలిపింది.
తన పాత్రకు షూటింగ్ పూర్తి చేసిన పవన్ :
ఇదిలావుంటే.. ఫిబ్రవరి 22న ప్రారంభమైన ఈ సినిమాలో పవన్ భగవంతుడి పాత్రలో నటిస్తున్నారు. 20 నుంచి 25 రోజుల పాటు ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. ఇందుకు గాను పవర్ స్టార్ రోజుకు రెండు కోట్లను పారితోషికంగా అందుకున్నారని ఫిలింనగర్ టాక్. తొలిసారిగా సాయిధరమ్ తేజ్, పవన్ కలిసి నటిస్తూ వుండటంతో వారిద్దరిని తెరపై చూడాలని మెగా అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments