close
Choose your channels

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోండి.. జనసేనాని పిలుపు

Monday, August 5, 2019 • తెలుగు Comments

వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోండి.. జనసేనాని పిలుపు

గోదావ‌రి వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకోవాల‌ని పార్టీ కార్యక‌ర్తల‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పిలుపునిచ్చారు. దేవీప‌ట్నం ప‌రిస‌ర ప్రాంతాల్లో ప్రభుత్వం స‌హాయ‌క చ‌ర్యలు చేప‌ట్టిన‌ప్పటికీ, జ‌న‌సేన కార్యక‌ర్తలు, నాయ‌కులు కూడా ముంపు బాధితుల‌కు ఎవ‌రి స్థాయి మేర‌కు వారు స‌హాయ స‌హ‌కారాలు అందించాల‌ని విజ్ఞప్తి చేశారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో రెండు రోజుల ప‌ర్యట‌న‌కు విచ్చేసిన ఆయ‌న రాజ‌మండ్రి ఎయిర్‌పోర్టులో మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యక‌ర్తలకు దిశానిర్ధేశం చేయ‌డం, భ‌విష్యత్ కార్యాచ‌ర‌ణ ర‌చ‌న‌, రెండు నెల‌ల త‌ర్వాత కొత్త ప్రభుత్వ ప‌ని తీరు ఎలా వుంది అనే అంశాలు ఈ ప‌ర్యట‌న‌లో ప్రధాన అజెండాలుగా ఉంటాయ‌ని స్పష్టం చేశారు.

రాజ‌కీయాలు హుందాగా ఉండాల‌ని జ‌న‌సేన పార్టీ కోరుకుంటుంద‌నీ, పార్టీ శాస‌న‌స‌భ్యులు రాపాక వ‌ర‌ప్రసాద్‌ స‌భ‌లో అందుకు త‌గ్గట్టే వ్యవ‌హ‌రిస్తున్నార‌ని తెలిపారు. జనసేన పార్టీ ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లు ఉండదన్నారు. వైసీపీ, టీడీపీల‌పై కూడా స‌భ‌ను హుందాగా న‌డ‌పాల్సిన బాధ్యత ఉంద‌న్నారు. అంత‌కు ముందు రాజ‌మండ్రి ఎయిర్‌పోర్టులో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన నాయ‌కులు, కార్యక‌ర్తల నుంచి ఘ‌న‌ స్వాగ‌తం ల‌భించింది. పవన్ కల్యాణ్ వెంట రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పి.రామ్మోహన్ రావుతో పాటు పార్టీ శాస‌న‌స‌భ్యులు రాపాక వ‌ర‌ప్రసాద్‌తో పాటు పలువురు కీలక నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz