close
Choose your channels

కోడెల మరణంపై జనసేనాని రియాక్షన్ ఇదీ...

Monday, September 16, 2019 • తెలుగు Comments

కోడెల మరణంపై జనసేనాని రియాక్షన్ ఇదీ...

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాజకీయంగా ఎదురవుతున్న ఒడిదుడుకులు ఎదురుకోలేక ఆయన తుదిశ్వాస విడవటం తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. కోడెలపై వచ్చిన ఆరోపణలు, విమర్శలపై ఆయన రాజకీయంగా పోరాటం జరిపి ఉంటే బాగుండేదన్నారు.

శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా!

‘ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నాను. ఈ ఆపత్కాల సమయంలో కోడెల కుటుంబసభ్యులకు ఆ దేవుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలని కోరుతున్నాను. రాజకీయవేత్తగా అంచెలంచలుగా ఎదిగి శాసనసభ్యునిగా, మంత్రిగా, ఆంధ్రప్రదేశ్ స్పీకర్‌గా కోడెల శివప్రసాదరావు ఎన్నో పదవుల్ని అలంకరించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు దేవుడు మానసిక స్థయిర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నా తరపున, పార్టీ తరపున కోడెల మృతికి తీవ్ర సంతాపం తెలుపుతున్నాను’ అని పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. 

Get Breaking News Alerts From IndiaGlitz