ఎన్టీఆర్ ట్రస్ట్ కు పవన్ విరాళం


Send us your feedback to audioarticles@vaarta.com


షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్రను పూర్తి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, నేరుగా యుఫోరియా మ్యూజికల్ నైట్ కు హాజరయ్యారు. తలసీమియా బాధితుల కోసం ఫండ్ రైజ్ చేసేందుకు ఈ మ్యూజికల్ నైట్ ఏర్పాటుచేశారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణతో పాటు అంతా టికెట్ తీసుకొని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఓ మంచి పనికి తమవంతు సహాయ సహకారాలు అందించారు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం టికెట్ తీసుకోలేదు. ఫ్రీగా ఈవెంట్ కు వచ్చేశారు.
తలసీమియా బాధితుల కోసం ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి ఫ్రీగా రావడం పట్ల చాలా గిల్టీగా ఉందన్నారు పవన్ కల్యాణ్. అందుకే తన వంతుగా ఎన్టీఆర్ ట్రస్ట్ కు 50 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సందర్భంగా బాలకృష్ణతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు డిప్యూటీ సీఎం. బాలకృష్ణను ఎప్పుడు కలిసినా 'సర్' అని పిలవాలనిపిస్తుందని, ఆయన మాత్రం బాలయ్య అని పిలవమని అడుగుతుంటారని గుర్తుచేసుకున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout

-
Devan Karthik
Contact at support@indiaglitz.com