close
Choose your channels

దిల్ రాజుకు పవన్ మళ్లీ గ్రీన్ సిగ్నల్.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..

Wednesday, April 28, 2021 • తెలుగు Comments

దిల్ రాజుకు పవన్ మళ్లీ గ్రీన్ సిగ్నల్.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని ఏ దర్శక నిర్మాతకు ఉండదు? నిర్మాత దిల్ రాజుకైతే పవన్‌తో సినిమా చేసేందుకు చాలా కాలమే పట్టింది. కానీ రెండో సినిమా కోసం మాత్రం దిల్ రాజు పెద్దగా వెయిట్ చేయాల్సిన పని లేకుండా పోయింది. దిల్‌ రాజుకు పవన్ మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు టాక్ నడుస్తోంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే ‘వకీల్ సాబ్’ సినిమా వచ్చి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ‘వకీల్ సాబ్’ సక్సెస్‌తో ఫుల్ ఖుషీగా ఉన్న దిల్ రాజు మరో సినిమా కోసం పవన్‌ను సంప్రదించారట.

దిల్ రాజుకు పవన్ మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. అంతే కాదు.. వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న రెండవ చిత్రానికి గానూ పవన్ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే పవన్ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అలాగే అయ్యప్పనమ్ కోషియం రీమేక్ చిత్రాల షూటింగ్‌లను ఏక కాలంలో నిర్వహిస్తున్నారు. ఇవి పూర్తయిన వెంటనే దర్శకుడు హరీష్ శంకర్‌తో సినిమా చేయనున్నారు. ఇక దర్శకుడు సురేందర్‌ రెడ్డి చిత్రానికి సైతం పవన్ సైన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాదికి పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో దిల్ రాజుతో సినిమా 2023లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే... ఇక పవన్ ఇచ్చిన భరోసాతో దిల్ రాజు ఇప్పటికే చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును రెడీ చేయాలని దర్శకుడు వంశీ పైడిపల్లికి సూచించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఇప్పటికే వంశీ కమర్షియల్ ఎలిమెంట్స్, సోషల్ మెసేజ్‌తో కూడా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్టు సమాచారం. తను రెడీ చేసిన స్క్రిప్ట్ పవన్‌కు బాగా సూట్ అవుతుందని వంశీ భావిస్తున్నారట. అలాగే దిల్ రాజుకు కూడా ఈ కథ నచ్చేసిందని సమాచారం. అన్నీ ఓకే అయితే.. స్క్రిప్ట్ నెరేషన్ కోసం వీరు ముగ్గురూ త్వరలోనే కలవనున్నట్టు టాక్. ఇటీవలే పవన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కోలుకున్న వెంటనే షూటింగ్‌ల్లో పాల్గొనే అవకాశం ఉంది.

Get Breaking News Alerts From IndiaGlitz