close
Choose your channels

జ‌న‌సేన విలీనంపై పవన్ క్లారిటీ

Monday, August 5, 2019 • తెలుగు Comments

జ‌న‌సేన విలీనంపై పవన్ క్లారిటీ

‘నా మీద న‌మ్మకం ఉంచి ఓటు వేసిన‌ ప్రతి ఒక్కరికీ భీ‌మ‌వ‌రం నుంచి మాటిస్తున్నా.. జ‌న‌సేన పార్టీని మ‌రే పార్టీలో క‌లిపే ప్రస‌క్తే లేద‌ు’ అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ మ‌ధ్య బీజేపీలో క‌లిపేస్తారంటూ ప్రచారం చేస్తున్నార‌నీ, తన ప్రాణంపోయినా అది జ‌ర‌గ‌ద‌ని తేల్చి చెప్పారు. రెండు రోజుల ప‌ర్యట‌న నిమిత్తం భీమ‌వ‌రం వ‌చ్చిన ఆయ‌న ఉండి రోడ్డులోని కోట్ల ఫంక్షన్ హాల్‌లో భీమవరం నియోజకవర్గ పార్టీ నాయ‌కులు, కార్యకర్తల‌తో ముఖాముఖి స‌మావేశం అయ్యారు.

ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ మాట్లాడుతూ... ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీతో లోపాయికారి ఒప్పందం అంటూ ఇదే విధ‌మైన ప్రచారం చేశారని.. ఏదైనా ఉంటే బ‌య‌టికి చెప్పే చేస్తా, లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోవ‌డానికి ఎలాంటి భ‌యాల్లేవన్నారు. 

మ‌నం ఒంట‌రిగా పోటీ చేశాం కాబ‌ట్టే వైసీపీకి విజ‌యం ద‌క్కిందని.. 2018లో టీడీపీని తిట్టిన త‌ర్వాత,  అవ‌కాశవాద రాజ‌కీయాలు చేయాలి అనుకుంటే.. భీమ‌వ‌రంలో టీడీపీ అభ్యర్ధి లేకుండా తానే రెండు పార్టీల త‌ర‌ఫున బ‌రిలోకి దిగేవాడిని క‌దా.. అంతేకాదు గాజువాక‌లో టీడీపీ అభ్యర్థి  లేకుండా జాగ్రత్త తీసుకునేవాడిని క‌దా.. లేదంటే అభ్యర్ధుల్ని మార్పించుకునేవాడిని క‌దా.. అని ఈ సందర్భంగా విమర్శకుల నోరు మూయించారు పవన్.

Get Breaking News Alerts From IndiaGlitz