close
Choose your channels

జనసైనికులు ఇలా చేయడం వల్లే ఓటమి..12న నిరాహారదీక్ష!

Sunday, December 8, 2019 • తెలుగు Comments

జనసైనికులు ఇలా చేయడం వల్లే ఓటమి.. 12న నిరాహారదీక్ష!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. పార్టీ అధినేత ఒకచోట కాదు రెండు చోట్ల పోటీ చేసినా గెలవని పరిస్థితి. అయితే రానున్న పంచాయితీ ఎన్నికల్లో ఇదే సీన్ రిపీట్ కాకూడదని భావించిన పవన్.. ఇప్పుడు జిల్లాల బాట పట్టి పార్టీని బలోపేతం చేయడానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఆదివారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతు సదస్సులో పాల్గొన్నారు. రైతులు తమ సమస్యలను పవన్‌ వినిపిస్తుండగా కార్యక్రమానికి వచ్చిన జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున విజిల్స్.. జై పవన్.. జైజై పవన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కార్యకర్తలపై పవన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఎన్నికల్లో ఓడిపోయామని కార్యకర్తలపై పవన్‌ కన్నెర్రజేశారు. జనసైనికులకు తప్పనిసరిగా క్రమశిక్షణ అనేది తప్పనిసరి అని ఆయన హెచ్చరించారు.

నిరాహార దీక్ష చేస్తా!

‘100 మంది రైతుల్లో 60శాతం కౌలు రైతులే. ధాన్యం విక్రయించి 45 రోజులు గడుస్తున్నా రైతులకు డబ్బులు ఇవ్వకపోవడం అన్యాయం. ధాన్యం నిల్వచేసిన రైతులకు రసీదులు ఇవ్వాలి. ముద్దులు పెట్టి కౌగిలించుకుంటే రైతుల కడుపులు నిండవు. ఓట్ల కోసం డబ్బులు ఇస్తారు కానీ రైతు కన్నీళ్లు తుడిచే ప్రభుత్వాలు లేవు. ఒక కులానికి రైతు భరోసా వర్తించదని చెప్పడం దుర్మార్గం. అసెంబ్లీలో రైతు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 12న కాకినాడలో నిరాహార దీక్ష చేస్తాను’ అని పవన్‌ కల్యాణ్‌ చెప్పుకొచ్చారు.

Get Breaking News Alerts From IndiaGlitz