close
Choose your channels

ఆసక్తికరంగా మారిన పవన్, అలీల కలయిక..

Monday, February 22, 2021 • తెలుగు Comments

ఆసక్తికరంగా మారిన పవన్, అలీల కలయిక..

2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం చాలా మంచి స్నేహితులైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్, కమెడియన్ అలీల మధ్య విభేదాలు వచ్చాయంటూ టాక్ నడిచింది. ఆ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో ఇద్దరూ కలిసిన సందర్భాలు కానీ.. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు కానీ బయటకు వచ్చింది లేదు. తాజాగా వీరిద్దరూ కలిసి ఒకే స్టేజిపైనే కాదు.. ఒకే స్క్రీన్‌లో కనిపించడం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరూ సరదాగా నవ్వుతూ మాట్లాడుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రెండు రోజుల క్రితం అలీ బంధువుల ఇంట్లో ఓ వివాహ వేడుక జరిగింది. ఈ వివాహ వేడుకకు పవర్ స్టార్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా వధూవరులకు అభినందనలు తెలిపిన అనంతరం పవన్‌కల్యాణ్‌తో ఆలీ, ఆయన సతీమణి సెల్ఫీ తీసుకున్నారు. అంతేకాకుండా ఆలీ.. పవన్‌తో నవ్వుతూ మాట్లాడడం.. పవన్‌ కూడా సరదాగా మాట్లాడటం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోను ఆలీ సతీమణి జుబేదా సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఇది చూసిన నెటిజన్లు ఎంతో సంతోషిస్తున్నారు. దీంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది. అలీ విషయంలోనే కాదు.. కమెడియన్ పృధ్వీ విషయంలో కూడా సానుకూలత చూపించడం విశేషం. 2019 ఎన్నికల సమయంలో పృధ్వీ కూడా పవన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అటువంటి పృధ్వీ ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న విషయం తెలిసి పవన్ తన సినిమాలో అవకాశమిచ్చినట్టు సమాచారం. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌.. మలయాళీ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌లో బిజీగా పాల్గొంటున్నారు. దీనితోపాటు ఆయన క్రిష్‌తో ఓ సినిమా చేస్తున్నారు.

Get Breaking News Alerts From IndiaGlitz