close
Choose your channels

 డిసెంబర్ 9 న విడుదలవుతున్న 'పంచతంత్రం'

Sunday, October 9, 2022 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద ప్రధాన తారాగణంగా నటిస్తున్న చిత్రం ‘పంచతంత్రం’. టికెట్‌ ఫ్యాక్టరీ, ఎస్‌ ఒరిజినల్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి అఖిలేష్‌ వర్ధన్‌, సృజన్‌ ఎరబోలు నిర్మాతలు. "పంచతంత్రం" సినిమాను డిసెంబర్ 9న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో బ్రహ్మానందం కాస్త సీరియస్ గా, వ్యామోహంతో 'పంచతంత్రం' అనే పదం రాసి ఉన్న క్యాసెట్ ని చూస్తూ మొదలవుతుంది. తర్వాత రాహుల్ విజయ్ కాస్త ఆత్రుతగా, గాలిలోకి చూస్తూ నడవడం మనం చూస్తాము. హ్యాపీ మూడ్‌లో ఉన్న శివాత్మిక రాజశేఖర్‌ని అతనికి జోడీగా చూపించారు. సముద్రఖని మరియు దివ్య వాణి మధ్య వయస్కులైన జంటగా కనిపిస్తున్నారు , ఆ తర్వాత దివ్య శ్రీపాద తన భర్తతో కలిసి ఆనందకరమైన భావోద్వేగ మూడ్‌లో ఉన్న దృశ్యాలు కనిపిస్తాయి .సాగాగా అభివర్ణిస్తున్న ఈ చిత్రంలో 'కలర్స్' స్వాతి కీలక పాత్రలో నటిస్తోంది. ఆమె మరోసారి 'పంచతంత్రం' క్యాసెట్‌తో వృత్తాన్ని పూర్తి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలోని 'అరెరే అరెరే' అనే పాటను సంచలన హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా విడుదల చేశారు.. ‘యే రాగమో’ అనే మరో పాటను కూడా విడుదల చేశారు. ఈ పాటలకు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేస్తున్న సందర్బంగా

చిత్ర నిర్మాతలు సృజన్‌ ఎరబోలు, అఖిలేష్ వర్ధన్ మాట్లాడుతూ.. మేము ఇంతకు ముందు బ్రహ్మానందంపై విడుదల చేసిన ప్రచార చిత్రాలు, ఫ‌స్ట్ గ్లింప్స్‌, ఏ రాగమో లిరికర్ వీడియోకు, విజయదేవరకొండ చేతుల మీదుగా విడుదల చేసిన “అరెరే.. అరెరే.. మాటే..రాదే.. మనసే పలికే క్షణములో..లిరికల్ వీడియో సాంగ్ కు, “ఏ రాగమో..నన్నే.. రమ్మని పిలుస్తున్నదే..లిరికల్ సాంగ్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. బ్రహ్మానందం గారు మా సినిమాలో వేదవ్యాస్ గా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. అలాగే సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్‌ విజయ్‌, ‘మత్తు వదలరా’ ఫేమ్‌ నరేష్‌ అగస్త్య, దివ్య శ్రీపాద అందరూ చాలా బాగా నటించారు. నటీ నటులు టెక్నిషియన్స్ అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 9 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

చిత్ర దర్శకుడు హర్ష పులిపాక మాట్లాడుతూ..మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా కథలోని పాత్రలను అందంగా, ఆసక్తికరంగా ఉండేలా రాసుకొని తెరకెక్కించడం జరిగింది. వేదవ్యాస్ పాత్రలో బ్రహ్మానందం గారు జీవించారు అని చెప్పవచ్చు.. అలాగే బ్రహ్మానందం, స్వాతిరెడ్డి మధ్య సన్నివేశాలు ఎంతో హృద్యంగా ఉంటాయి. వీరి పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేస్తాయి.ఇందులో నటించిన వారంతా చాలా చక్కటి నటనను కనబరిచారు. అన్ని వర్గాల వారికి నచ్చేవిధంగా తెరకెక్కిన ఈ సినిమాను డిసెంబర్ 9 న గ్రాండ్ గా ప్రేక్షకులకు ముందుకు వస్తుంది. ప్రేక్షకులందరూ మా చిత్రాన్ని ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.